‘ఖుషి’ అప్పటి ట్రైలర్‌, ఇప్పటి ట్రైలర్‌ డిఫరెన్స్‌ ఇదే!

సినిమాల రీ రిలీజ్‌ ట్రెండ్‌ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అయితే సరైన సినిమాలు రీరిలీజ్‌లు చేయకుండా.. కొంతమంది విషయంలో తప్పులు జరుగుతున్నాయి అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే.. సినిమాల రెండో రిలీజ్‌కు ఎలాంటి ప్రచారం చేశాం అనేది చాలాముఖ్యం. తాజాగా ‘ఖుషి’ సినిమా ట్రైలర్‌ వచ్చింది. ఈ సినిమాను కొత్త సంవత్సరం ఈవ్‌ సందర్భంగా రిలీజ్‌ చేస్తున్నారు. థియేటర్లలో ఎలాంటి సందడి ఉంటుందో తెలియదు కానీ.. ట్రైలర్‌తో సోషల్‌ మీడియాలో అయితే భలే కిక్‌ వచ్చింది ఫ్యాన్స్‌కి.

పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఖుషి’. పవన్‌ కెరీర్‌ ‘ఖుషి’కి ముందు, తర్వాత అనేలా మాట్లాడుతుంటారు అభిమానులు. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీనే సృష్టించింది అని చెప్పాలి. రిపీట్‌ పాటలు, ఫైట్లతో ఆ రోజుల్లో థియేటర్లలో సినిమా సందడి మామూలుగా జరగలేదు. ఇప్పటితరానికి ఆ సినిమా థండర్‌ రెస్పాన్స్‌ చెబితే ఊహించలేరు కూడా. 21 ఏళ్ల క్రితం ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఏఎమ్‌ రత్నం ఈ సినిమాను నిర్మించారు.

‘ఖుషి’ చిత్రానికి ప్రస్తుతం సాంకేతికంగా అదనపు హంగులు జోడించి విడుదల చేస్తున్నారు. 4కే రిజల్యూషన్‌, 5.1 డాల్బీ ఆడియో తదితర మార్పులు చేసి థియేటర్లలో ‘ఖుషి’ సినిమాను విడుదల చేస్తున్నారు. కొత్త ట్రైలర్‌ సంగతి, పాత ట్రైలర్‌ను కంపేర్‌ చేస్తే.. కొన్ని మార్పులు కనిపిస్తాయి. తొలి ట్రైలర్‌లో ఫ్రెండ్‌ ప్రేమ కోసం సిద్ధు అలియాస్‌ పవన్‌ కష్టపడినట్లు స్టార్ట్‌ అవుతుంది. ఆ తర్వాత వీళ్ల ఈగో లవ్‌ కథ ట్రాక్‌లోకి వస్తుంది.

కొత్త ట్రైలర్‌ను ప్రస్తుతం పవన్‌ ఇమేజ్‌కి తగ్గట్టు కట్‌ చేశారు అని చెప్పొచ్చు. ప్రేమ, పాటలు, యాక్షన్‌, కామెడీని మిక్స్‌ చేసి ట్రైలర్‌ను కట్‌ చేశారు. పవన్‌ ట్రేడ్‌ మార్క్‌ వాక్‌, స్మైల్‌తో ట్రైలర్‌ను నింపేశారు. అప్పుడు సినిమా చూసినవాళ్లకు మరోసారి సినిమా చూద్దాం అనిపించేలా ఉంది ఈ ట్రైలర్‌ అంటే అతిశయోక్తి కాదు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus