Kv Anand: కె.వి.ఆనంద్ తో మహేష్ సినిమా అలా మిస్సయ్యిందట..!

కోలీవుడ్ డైరెక్టర్లు మహేష్ తో సినిమా చెయ్యాలని ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా మహేష్ ముందుండేవాడు కాబట్టి.! కోలీవుడ్ డైరెక్టర్లంటే కూడా మహేష్ కు కూడా చాలా ఇష్టం. కానీ ‘నాని’ ‘స్పైడర్’ వంటి సినిమాలను చేసి చేతులు కాల్చుకున్నాడు. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో కూడా మహేష్ సినిమా చెయ్యాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు.

వివరాల్లోకి వెళితే..తమిళ ద‌ర్శ‌కుడు కెవి ఆనంద్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. గతంలో ‘వీడోక్కడే’ ‘రంగం’ ‘బ్రదర్స్’ ‘బందోబస్త్’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. తెలుగులో ‘రంగం’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. అయితే ‘రంగం’ త‌ర‌వాత‌.. మహేష్- కె.వి.ఆనంద్ ల కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉందట. కె.వి.ఆనంద్ తో సినిమా చేయ‌డానికి మహేష్ కూడా ఓకే చెప్పాడట. అయితే అదే టైంకి.. సూర్యతో ‘బ్రదర్స్’ సినిమా చెయ్యాల్సి వచ్చింది కె.వి.ఆనంద్ కు..! దాంతో మహేష్ వెంటనే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అలా ఆ ప్రాజెక్టు హోల్డ్ లో పడిపోయింది. తరువాత కూడా కె.వి.ఆనంద్ ట్రై చేసినా మహేష్ కాల్షీట్లు ఖాళీ లేక తమిళ హీరోలతోనే సినిమాలు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ‘ఆగడు’ సినిమాకి ముందు కూడా కె.వి.ఆనంద్ తో సినిమా చెయ్యాలని మహేష్ అనుకున్నాడు. కానీ ‘ఆగడు’ ఫలితం తేడా కొట్టడంతో రిస్క్ ఎందుకులే అని కె.వి.ఆనంద్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏది ఏమైనా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే కమర్షియల్ గా ఫలితం ఎలా ఉండేదో చెప్పలేము కానీ ‘1 నేనొక్కడినే’ తరహా క్లాసిక్ గా అయితే మిగిలుండేది అని చెప్పడంలో సందేహం లేదు..!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus