2019 లో లో వచ్చిన మలయాళ సినిమా ‘లూసిఫర్’ తెలుగులోనూ డబ్ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడ పెద్దగా ఆడకపోయినా మలయాళంలో మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా ‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2: Empuraan) రూపొందింది. ఉగాది కానుకగా మార్చి 27న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. దీనికి కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించారు. దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ మలయాళంలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ చూపలేకపోయింది. ఒకసారి ‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2: Empuraan) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 1.05 cr |
సీడెడ్ | 0.30 cr |
ఆంధ్ర(టోటల్) | 0.62 cr |
ఏపీ+ తెలంగాణ | 1.97 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) | 0.20 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 2.17 cr (షేర్) |