బన్నీ హీరోయిన్ కు చివరి అవకాశం!
- April 4, 2016 / 10:00 AM ISTByFilmy Focus
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటి కేథరిన్ తెరెసా. ఇద్దరమ్మాయిలతో నుంచి రుద్రమదేవి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ అమ్మడుని పట్టించుకునేవారే లేరు. ఇప్పుడు ‘సరైనోడు’లో బన్నీతో మరోసారి ఆడిపాడబోతోంది. అయితే ఈ సినిమాలో కూడా కేథరిన్ రెండో హీరోయిన్ గానే కనిపిస్తుంది. సెకండ్ హీరోయిన్ అయినా.. ఈ సినిమాలో తనదొక మెయిన్ రోల్ అని తెలుస్తోంది. అటు గ్లామర్‌కీ, ఇటు నటనకూ.. అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాతో మంచి పేరోస్తుందని కేథరిన్ ఆశ పడుతోంది. ఈ సినిమా తప్ప తెలుగులో మరో అవకాశం లేని కేథరిన్ కు సరైన బ్రేక్ రాకపోతే.. ఇక తెలుగులో అవకాశాలు రావడం కష్టమే..
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















