Lavanya Tripathi: నెటిజన్ కామెంట్లపై లావణ్య రియాక్షన్ ఇదే!

కొన్నేళ్ల క్రితం వరకు వరుసగా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. అయితే ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో లావణ్య త్రిపాఠికి గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం తెలుగులో లావణ్య త్రిపాఠి పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందిన లావణ్య అనే సాధారణ యువతి తాజాగా ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది మత మార్పిడి విషయంలో బలవంతం చేయడంతో లావణ్య ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే సాధారణ యువతి అయిన లావణ్యకు బదులుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వైరల్ అయిన లావణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగ్ గురించి ఒక నెటిజన్ చులకనగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అయ్యాయి. సదరు నెటిజన్ లావణ్య సాధారణ అమ్మాయని లావణ్య త్రిపాఠి చౌకబారు నటి అని సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగ్ ను వాడవద్దని సూచనలు చేశారు.

లావణ్య ధర్మం కొరకు లైఫ్ ను త్యాగం చేసిందని ఆమెను హీరోయిన్ తో పోల్చడం కరెక్ట్ కాదని నెటిజన్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు లావణ్య త్రిపాఠి దృష్టికి వచ్చాయి. తనను చీప్ హీరోయిన్ అన్న నెటిజన్ పై లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు. తనపై కామెంట్లు చేసిన నెటిజన్ మొదట గౌరవించడం నేర్చుకుంటే మంచిదని అమ్మాయిల గురించి చీప్ గా మాట్లాడే నీలాంటి వాళ్లు ఎక్కడైనా చెడు జరిగిన సమయంలో మాత్రం ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారని లావణ్య త్రిపాఠి అన్నారు.

ఈ ఘటన చాలా బాధాకరమైన సంఘటన అయినప్పటికీ సమాజంలో వాస్తవ పరిస్థితి ఇదేనని ఆమె చెప్పుకొచ్చారు. లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠి అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ఆమెను సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తుండటం గమనార్హం.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus