Lavanya Tripati, Varun Tej: వరుణ్ తేజ్ గురించి లావణ్య త్రిపాఠి అలా అన్నారా?

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మధ్య ఏదో ఉందని జరిగిన ప్రచారం అంతాఇంతా కాదు. అయితే ఈ వార్తల గురించి అటు వరుణ్ తేజ్ నుంచి కానీ ఇటు లావణ్య త్రిపాఠి నుంచి కానీ స్పష్టత రాలేదు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రెండు సినిమాలలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి ఒక టీవీ షోలో వరుణ్ తేజ్ గురించి పాజిటివ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మెగా ఫ్యామిలీకి చెందిన ఫంక్షన్లకు సైతం లావణ్య త్రిపాఠి హాజరవుతారనే సంగతి తెలిసిందే. తాజాగా సుమ అడ్డా షోలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తన క్రష్ అని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఈ నెల 25వ తేదీన ఈటీవీ ఛానల్ లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని సమాచారం అందుతోంది. పులి మేక ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అయ్యాయి.

అసలు నేను రాజీవ్ కనకాలను ఇంత కూడా టార్చర్ పెట్టలేదని లావణ్య త్రిపాఠిపై ప్రామిస్ అని సుమ చెప్పగా యూటర్న్ అంటూ లావణ్య త్రిపాఠి కామెంట్ చేశారు. మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరని నాని, వరుణ్ తేజ్ పేర్లను ఆప్షన్ గా ఇవ్వగా వరుణ్ తేజ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు. లావణ్య త్రిపాఠి వరుణ్ పై తన ప్రేమను పరోక్షంగా చెప్పుకొచ్చారు.

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ డైరెక్ట్ గా క్లారిటీ ఇస్తే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వరుస ఫ్లాపుల వల్ల లావణ్య త్రిపాఠికి ఆఫర్లు తగ్గాయి. పులి మేక వెబ్ సిరీస్ లావణ్య త్రిపాఠికి మంచి పేరును తెచ్చిపెడుతుందేమో చూడాలి. లావణ్య వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus