LEO Trailer: విక్రమ్ ను మించిన యాక్షన్ ఎంటర్టైనర్ అయ్యేలా ఉందిగా

‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ‘లియో’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి స్టార్లు కూడా నటించారు. అనిరుధ్ సంగీత దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సినిమాలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటంతో ‘లియో’ పై అంచనాలు భారీగానే పెరిగాయి.

అక్టోబర్ 19 న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో వచ్చే వాయిస్ ఓవర్ ను బట్టి.. ఈ సినిమాలో విజయ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. అందులో ఓ పాత్ర(విజయ్) పై పగతో విలన్ గ్యాంగ్ మరో విజయ్ ను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే అది నిజమా లేక ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది సినిమాలో చూడాలి.

ఇక హీరోయిన్ త్రిష లుక్స్ బాగున్నాయి. భార్యను, కూతుర్ని కాపాడుకునే పాత్రలో విజయ్ నటన బాగుంది. ఈ ట్రైలర్ మొత్తంలో హైలెట్ అయ్యింది యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అయితే సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలకి కూడా స్కోప్ ఉన్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ బాగానే ఉంది. సినిమా (LEO) పై అంచనాలు పెంచింది అనుకోవచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags