సినిమా బాగోలేకపోతే, అందులోనూ డిజాస్టర్ అయితే… కొన్నాళ్ల క్రితం థియేటర్లలో కుర్చీలు, తెరలు చింపేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా బాగుంటే, చాలా బాగుంటే మంటలు పెట్టేస్తున్నారు. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ఒకప్పుడు సినిమా అంచనాలకు దగ్గరగా లేకపోతే థియేటర్లలో ఫ్యాన్స్ ఆగ్రహాలు మామూలుగ ఉండేవి కావు. అయితే ఓ సినిమా ట్రైలర్ బాగోలేదని ఏకంగా థియేటర్‌ను నాశంన చేసేశారు. మీరు చదివించి నిజమే.. ట్రైలర్ తమ అంచనాలకు అనుగుణంగా లేదని థియేటర్‌లో రణరంగం సృష్టించారు.
అయితే అది ఇక్కడ కాదు, తమిళనాడులో. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ – స్టార్ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేన్‌లో రూపొందుతున్న చిత్రం ‘లియో’. ఈ సినిమా కోసం అభిమానులు చాలా రోజులుగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ను భారీ స్థాయిలో విడుదల చేశారు. గురువారం సాయంత్రం ఈ సినిమా (LEO) ట్రైలర్‌ను చెన్నైలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు.
ట్రైలర్‌కు పరిశ్రమ వర్గాల నుండి, అభిమానుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు. థియేటర్లోని సీట్లను విరగొట్టారు. ఈ ఘటన చెన్నైలోని రోహిణి థియేటర్లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం దగ్గరగా లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. అయితే థియేటర్ యాజమాన్యం అనుకున్న సమయానికి ట్రైలర్‌ను వేయకపోవడంతోనే…
అభిమానులకు ఆగ్రహం వచ్చి ఇలా చేశారని కొంతమంది అభిమానులు అంటున్నారు. ధ్వంసమైన థియేటర్లోనే మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లకు అభిమానులు ట్రైలర్ గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కాబట్టి ఇది ట్రైలర్ నచ్చక చేసిన పనే అని ఫైనల్ అయిపోతున్నారు నెటిజన్లు. ఇలాంటివి కొనసాగితే త్వరలో ట్రైలర్ రిలీజ్‌లకు థియేటర్లు ముందుకురాకపోయే ప్రమాదమూ ఉందని చెబుతున్నారు.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!