విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ అనేది క్యాప్షన్. ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మైక్ టైసన్ ఈ మూవీతో ఇండియన్ సినిమాల్లో అరంగేట్రం చేయడం కూడా సినిమాపై హైప్ పెరగడానికి కారణం అయ్యింది.
పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.కానీ రెండో రోజు మాత్రం కలెక్షన్లు దారుణంగా తగ్గిపోయాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
4.98 cr
సీడెడ్
1.51 cr
ఉత్తరాంధ్ర
1.48 cr
ఈస్ట్
0.76 cr
వెస్ట్
0.48 cr
గుంటూరు
0.84 cr
కృష్ణా
0.57 cr
నెల్లూరు
0.44 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
11.06 cr
తమిళనాడు
0.20 cr
కేరళ
0.15 cr
కర్ణాటక
0.72 cr
హిందీ
2.49 cr
ఓవర్సీస్
2.80 cr
టోటల్ వరల్డ్ వైడ్
17.42 cr
‘లైగర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.82.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.17.42 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.67.58 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాలి.
మొదటి రోజు మొదటి షోకే నెగిటివ్ టాక్ రావడంతో మ్యాట్నీ షోల నుండే ఈ చిత్రం కలెక్షన్లు తగ్గిపోయాయి. రెండో రోజు ఈ మూవీ ఏమాత్రం నిలబడలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల లోపే షేర్ నమోదవ్వడం షాకిచ్చే అంశం.