సూపర్ స్టార్ రజినీకాంత్ పై దర్శకుడు కెఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ కాంబినేషన్ లో వచ్చిన ‘లింగా’ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం రజినీకాంతే అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు రవికుమార్. 2014లో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో దర్శకుడు కెఎస్ రవికుమార్ ‘లింగా’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ లో రజినీకాంత్ వేలు పెట్టడం వలనే సినిమా ప్లాప్ అయిందని చెప్పుకొచ్చారు.
‘లింగా’ సినిమాకి ముందు అనుకున్న క్లైమాక్స్ వేరని చెప్పారు రవికుమార్. ఆయన మాట్లాడుతూ.. ”హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ నేను సీన్స్ ఎడిట్ చేస్తున్నానని. రజినీకాంత్ కి బ్రేక్ రావడం నా దగ్గరకు వచ్చి.. ఎడిటింగ్ లో ఏం చేస్తున్నారో చూడొచ్చా అని అడిగారు. లింగేశ్వరన్ క్యారెక్టర్ షూటింగ్ అయిపోయింది సార్.. అందులో చాలా ట్రిమ్ చేయాల్సి ఉంటుందని చెప్పాను.దానికి ఆయన దయచేసి ట్రిమ్ చేయొద్దు అని అన్నారు.
కథలో యంగ్ హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే లింగేశ్వరన్ క్యారెక్టర్ ఎడిట్ చేయాలని చెప్పగా.. ఆయన.. యంగ్ క్యారెక్టర్ హీరో కాదు.. లింగేశ్వరనే హీరో అని ఎమోషనల్ అయ్యారు. నాకు ఆయన అలా చెప్పడం నచ్చలేదు. నా అసిస్టెంట్స్ కి కూడా రజినీకాంత్ ఆలోచన నచ్చలేదు. అయినప్పటికీ తప్పలేదు. ఆయన చెప్పినట్లుగానే చేశాను. పైగా రజినీకాంత్ పుట్టినరోజుకి సినిమాను రిలీజ్ చేయాలనే ఒత్తిడి కూడా ఉండడంతో.. క్లైమాక్స్ పార్ట్ ను ఏదో తీసేశాను” అంటూ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా రిలీజై ఎనిమిదేళ్లు దాటేసింది. ఇప్పుడు సినిమా ప్లాప్ గురించి రజినీకాంత్ ని బ్లేమ్ చేయడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కానీ ఆయన ఇన్వాల్వ్ అవ్వడం వలనే తనకు ప్లాప్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు దర్శకుడు కె.ఎస్.రవికుమార్.