రాజమౌళి.. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన దర్శకుడు. ఆయన విజన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎమోషన్లతో ఫుడ్ బాల్ ఆడుకుంటారాయన. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది. ఓపెనింగ్స్ అయితే భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.కొంతవరకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ… వాటితో సంబంధం లేకుండా రెండో సారి కూడా చూడాలనిపించే విధంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో టీం అంతా చేసిన సందడి అంతా ఇంతా కాదు.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా తన వంతు ప్రమోషన్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు. అందులో ఆయన భార్య గురించి.. ఆమెకి చిరంజీవి కుటుంబానికి ఉన్న నేపధ్యం గురించి చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా రాజమౌళిలానే ప్రేమ వివాహం చేసుకున్నారు.ఆయన కమ్మ వర్గానికి చెందిన వారు.. అతని భార్య రాజనందిని కాపు వర్గానికి చెందిన మహిళ. అయితే ఈ విషయం ఆయనకి పెళ్ళైన చాలా రోజుల వరకు తెలీదట.
‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అయిన టైంలో ఆవిడ ‘మా చిరంజీవి’ .. ‘మా చిరంజీవి అదరగొట్టేసాడు’ అంటూ అనడంతో.. ఆయన మీకు ఏమైనా బంధువా అని విజయేంద్ర ప్రసాద్ గారు అడిగారట. దానికి ఆమె కాదు.. ‘చిరంజీవి కూడా మా వాళ్ళే’ అంటూ సమాధానం ఇచ్చిందట. ఆమె చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని.. తన కుటుంబంలో చాలా మంది ప్రేమ వివాహం అది కూడా కులాంతర వివాహం చేసుకున్నారని అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.