పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్. 2007 వ సంవత్సరం సెప్టెంబర్ 28 న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా డెబ్యూ హీరోల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. ఆ చిత్రంలో ఫైట్ లు, డ్యాన్స్ లు అద్భుతంగా చేశాడు రాంచరణ్. మాస్ ఆడియెన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.ఇక అటు తర్వాత వచ్చిన మగధీర చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పటి స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చాడు. ఆ తరువాత ఆరెంజ్ అనే క్లాస్ సినిమా చేసి ఫ్లాప్ మూటకట్టుకున్నప్పటికి ఆ చిత్రం చరణ్ కెరీర్ కు హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. సినిమా ఫలితంతో సంబందం లేకుండా విభిన్న కథా చిత్రాలతో దూసుకుపోతున్న చరణ్.. ఈ 13 ఏళ్ళ లో కొన్ని సినిమాలను కూడా రిజెక్ట్ చేసుకున్నాడు. అవేంటో.. వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ :
గౌతమ్ మేనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఓ క్లాసిక్ అనే చెప్పాలి. ఇందులోని పాటలను ఇప్పటికీ వింటూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మన ప్రేక్షకులు. మొదట ఈ చిత్రం చేసే అవకాశం చరణ్ కే వచ్చింది.కానీ మగధీర తో బిజీగా ఉండడం వలన వదులుకున్నాడు.
2) లీడర్ :
శేఖర్ కమ్ముల మొదట ఈ కథని చరణ్ కు చెప్పాడు. కథ నచ్చినప్పటికీ చరణ్ ఈ చిత్రాన్ని వదులుకున్నాడు. తరువాత బన్నీ వద్దకు కూడా వెళ్ళింది ఈ కథ. ఫైనల్ సురేష్ ప్రొడక్షన్స్ వారు ఫైనల్ చేసి రానా తో చేశారు.
3) డార్లింగ్ :
ప్రభాస్ కు కం బ్యాక్ మూవీ ఇది. మొదట ఈ కథ చరణ్ వద్దకే వెళ్ళింది.. అయితే ప్రభాస్ తో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని సూచించాడట చరణ్.అలా అది ప్రభాస్ చెయ్యడం జరిగింది.
4) ఎటో వెళ్ళిపోయింది మనసు:
మొదట రాంచరణ్ కు ఈ కథ వినిపించాడు గౌతమ్. రెండో సారి కూడా గౌతమ్ కథను రిజెక్ట్ చేశాడు చరణ్. తరువాత రామ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.కానీ ఎందుకో అతను కూడా తప్పుకున్నాడు. ఫైనల్ గా నాని ఈ సినిమా చేశాడు.
5) కృష్ణం వందే జగద్గురుమ్ :
క్రిష్, చరణ్ మంచి స్నేహితులు. మొదట ఈ కథని వెంకటేష్ కు వినిపించాడు క్రిష్. ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ వెంకీ చెయ్యలేకపోయాడు. తరువాత చరణ్ ను కూడా సంప్రదించాడు క్రిష్. కానీ రానా ఫైనల్ అయ్యాడు.
6) శ్రీమంతుడు :
చరణ్, ఎన్టీఆర్, బన్నీ.. ఈ ముగ్గురికి ఈ కథ వినిపించాడు కొరటాల. కానీ రిస్క్ అనిపించి నొ చెప్పారు. ఫైనల్ గా ఇది మహేష్ చెయ్యడం .. బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది.
7) మనం:
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ క్లాసిక్ మూవీ. మొదట చరణ్ తో పాటు మరికొంత మంది హీరోల వద్దకు వెళ్ళింది. కానీ ఫైనల్ గా అక్కినేని ఫ్యామిలీ కోసమే రాసిపెట్టినట్టు ఉంది.
8) కృష్ణార్జున యుద్ధం :
నాని డబుల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. మొదట ఈ కథ చరణ్ వద్దకు వెళ్ళింది కానీ అతను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
9) నేల టిక్కెట్ :
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ హీరో. కానీ మొదట ఈ కథకి చరణ్ ను సంప్రదించాడు దర్శకుడు.
10) ఓకె బంగారం :
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా చరణ్ రిజెక్ట్ చేశాడు. మరీ ఇంత క్లాస్ సినిమాలో అతన్ని ఊహించుకోవడం కూడా కష్టమే లెండి.