రవితేజకు సంక్రాంతి ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..?

  • January 5, 2021 / 01:29 PM IST

సంక్రాంతి పండుగ అంటే.. సినిమాలకు కూడా పెద్ద పండగే..! ఈ టైంలో విడుదలైన సినిమాలకు ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వస్తుంటాయి. ఒకవేళ ఆ సినిమాకి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే కనుక ఆ సినిమా అద్భుతాలు క్రియేట్ చెయ్యడం ఖాయం. సంక్రాంతి కి మాస్ మరియు ఫ్యామిలీ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు రవితేజ వంటి మాస్ హీరో సినిమా విడుదలైతే ఏ రేంజ్ హైప్ ఉంటుంది.

సరిగ్గా ఇప్పుడు క్రాక్ సినిమా పై అదే రేంజ్ హైప్ ఏర్పడింది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రవితేజ నటించిన క్రాక్ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత 3ఏళ్ళ నుండీ రవితేజ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మరి క్రాక్ తో సంక్రాంతికి హిట్టు కొట్టగలడా..? అసలు అతని సంక్రాంతి ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? అనే ప్రశ్నలు ఊపందుకున్నాయి.

మొదటిసారి రవితేజ 2003లో. ఈ అబ్బాయి చాలా మంచోడు అనే చిత్రంతో సంక్రాంతి బరిలో దిగాడు. అగత్యన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బిలో యావరేజ్ గా నిలిచింది.

రెండోసారి 2008 లో కృష్ణ అనే చిత్రంతో సంక్రాంతి బరిలో దిగాడు రవితేజ. వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం .. అప్పటికి రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఆ సంక్రాంతికి విన్నర్ గా నిలిచింది ఈ చిత్రం.

మూడవసారి 2010లో శంభో శివ శంభో అనే చిత్రంతో సంక్రాంతి బరిలో దిగాడు రవితేజ. సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం యావరేజ్ గా మిగిలింది. అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం మరో విశేషం.

నాలుగవ సారి 2011 లో మిరపకాయ్ చిత్రంతో సంక్రాంతి బరిలో దిగాడు రవితేజ. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

ఓవర్ ఆల్ గా సంక్రాంతికి రవితేజ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. ఒక బ్లాక్ బస్టర్, ఒక సూపర్ హిట్.. రెండు యావరేజ్ లతో రవితేజ సినిమాలు సంక్రాంతికి బాగానే పెర్ఫార్మ్ చేసాయి. ఇప్పుడు ‘క్రాక్’ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus