లాక్ డౌన్ ను యూటిలైజ్ చేసుకున్న ఏకైక హీరోయిన్ రష్మిక

ఈ లాక్ డౌన్ అనేది కొందరి కెరీర్ లు నెమ్మదించేలా చేసింది, కొందరి కెరీర్ లను ఏకంగా నాశనం చేసింది. కొందరికి మాత్రం ఊపిరినిచ్చింది. బుల్లెట్ ట్రైన్ లో దూసుకుపోతున్న పూజా హెగ్డే కెరీర్ కు లాక్ డౌన్ సడన్ బ్రేక్ వేసింది. దాంతో లాక్ డౌన్ తర్వాత అమ్మడు ఏ సినిమా ఒప్పుకోవాలి, ఏ సినిమా రిజెక్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ లో కొట్టుకుచస్తుంది. ఇక కొందరు హీరోయిన్లకు ఈ లాక్ డౌన్ హెల్ప్ అయ్యిందనే చెప్పాలి.

లాక్ డౌన్ లో బాగా ఖాళీగా ఉన్న కొందరు హీరోయిన్ల వీడియోలు, ఫోటోలు వారికి సరికొత్త అవకాశాలను తెచ్చిపెట్టాయి. అయితే.. వీళ్ళందరికీ భిన్నంగా రష్మిక ఈ లాక్ డౌన్ ను పరిచయాలు పెంచుకోవడం కోసం వినియోగించుకోంది.
తన ఆకస్మిక స్టార్ డమ్ వల్ల కావచ్చు.. వరుసబెట్టి అవకాశాలు తన్నుకోపోవడం వల్ల కావచ్చు రష్మిక అంటే ఆమె తోటి హీరోయిన్లకు ఒక రకమైన హేట్ ఏర్పడింది. ఆ కోపాన్ని అమ్మడు ఈ లాక్ డౌన్ టైంలో ప్రేమగా మార్చేసుకొని.. అందరికీ చేరువైపోయింది. ప్రస్తుతం రష్మిక అందరికీ హాట్ ఫేవరెట్. ముఖ్యంగా మహేష్ ఫ్యామిలీకి అమ్మడు బాగా దగ్గరైంది.

అందుకు కారణం ఈ లాక్ డౌన్ లో రష్మిక పాటించిన కొన్ని సూత్రాలు. అవేమిటంటే.. అందరికీ ఫోన్ ల ద్వారా కాంటాక్ట్ లో ఉండి, తనకంటే చిన్న స్థాయి, పెద్ద స్థాయి నటీనటులతో కూడా స్నేహంగా వ్యవహరించడం. తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా కొందరికి షౌటౌట్ ఇవ్వడం. ఈ విధంగా రష్మిక ఇప్పుడు అందరి అమ్మాయి అయిపోయింది. ఈ ఇమేజ్ ఇలాగే కంటిన్యూ అయితే.. ఆమె హిట్ & ఫ్లాప్ తో సంబంధం లేకుండా టాప్ హీరోయిన్ గా మరో 5 ఏళ్ళు కొనసాగడం ఖాయం.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus