Lokesh Kanagara, Vijay: లియో2 విషయంలో లోకేశ్ క్లారిటీ ఇదే.. సందేహాలకు చెక్ పెట్టారుగా!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అవుతూ ఉండగా మరో రెండు సినిమాలలో మాత్రమే నటిస్తానని విజయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. విజయ్ అలా కామెంట్లు చేయడంతో లియో2 సినిమాలో విజయ్ నటిస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. లియో2 కచ్చితంగా ఉంటుందని లోకేశ్ కనగరాజ్ అన్నారు. ప్రస్తుతం విజయ్ ఆశయం సినిమాలకు భిన్నంగా ఉందని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. ఆ విషయంలో విజయ్ ను అభినందిస్తున్నానని లోకేశ్ కనగరాజ్ వెల్లడించారు.

విజయ్ అంగీకరిస్తే మాత్రమే లియో2 ఉంటుందని కానీ దానికి సమయం అనుకూలించాలని ఆయన అన్నారు. విజయ్ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు లియో2 మూవీ మొదలవుతుందని లియో1 సెకండాఫ్ విషయంలో వచ్చిన విమర్శలను సైతం తాను విన్నానని లోకేశ్ కనగరాజ్ కామెంట్లు చేయడం గమనార్హం. ఇకపై చేసే సినిమాలలో ఆ తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటానని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు. లియో2 విషయంలో విజయ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

విజయ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు వచ్చే ఏడాది చివరినాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. విజయ్ రెమ్యునరేషన్ 130 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.విజయ్ తర్వాత రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ సీఎం కావాలని భావిస్తుండగా తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విజయ్ (Vijay) సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. విజయ్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా రాబోయే రోజుల్లో విజయ్ కు కెరీర్ పరంగా మరింత సక్సెస్ దక్కాలని నెటిజన్లు ఫీలవుతున్నారు. తన సినిమాలతో విజయ్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus