Love Story Collections: ఇంకా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతుంది..!

నాగ చైతన్య, సాయి పల్లవి… హీరో, హీరోయిన్లుగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’. ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ’, ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థల పై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లు కలిసి నిర్మించారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలయ్యింది.మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ ను కూడా బాగానే రాబట్టింది. వీక్ డేస్ లో కొంత తడబడినా … తర్వాత మళ్ళీ పికప్ అయ్యి బ్రేక్ ఈవెన్ ను సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ చిత్రం 12 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం 11.87 cr
సీడెడ్  4.24 cr
ఉత్తరాంధ్ర  2.87 cr
ఈస్ట్  1.57 cr
వెస్ట్  1.33 cr
గుంటూరు  1.48 cr
కృష్ణా  1.34 cr
నెల్లూరు  0.84 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  25.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.94 Cr
  ఓవర్సీస్   4.76 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  32.24 cr

‘లవ్ స్టోరీ’ చిత్రానికి రూ.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.12 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.32.24 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు ఇప్పటి వరకు రూ.0.24 కోట్ల లాభాలు దక్కాయని చెప్పొచ్చు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.