నేటి తరం ప్రేమకావ్యంగా టాలీవుడ్ పరిశీలకు చెబుతున్న సినిమా ‘లవ్‌స్టోరీ’. శేఖర్ కమ్ముల పనితనం మీద నమ్మకంతో పరిశీలకులు ఆ మాట అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా UA సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. 165.28 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సెన్సార్‌వాళ్లు సూచించన కట్స్ ఏంటో చూద్దాం!
శేఖర్ కమ్ముల సినిమా కదా… అంతగా సెన్సార్ కత్తెరకు పని ఉండదు లెండి. అనుకున్నట్లుగా ఈ సినిమాలో పెద్దగా కట్‌లు చెప్పింది. మొత్తంగా నాలుగే ఉన్నాయి. ఓ సన్నివేశంలో మద్యం బ్రాండ్స్ కనిపిస్తాయి. వాటిని కవర్ చేయమని అడిగారు. మరో దగ్గర ‘ఫ్రీగా’ అనే పదం దగ్గర ‘ఈజీగా’ అని మార్చమన్నారట. ఇవి కాకుండా మరికొన్ని పదాలు తొలగించమన్నారు. వాటిలో సైకో నా….., బాడ్‌కావ్, ….. తక్కువోడా లాంటివి ఉన్నాయి. వీటితోపాటు F..K off అనే పదాన్ని కూడా తీసేయమన్నారు.
మరోవైపు సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ తర్వాత ఓ సీన్‌ను యాడ్ చేశారట. మూడు నిమిషాల నిడివి ఉన్న సన్నివేశంలో కొన్ని కీలకమైన డైలాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా 21 సన్నివేశాలను చిత్రబృందం వాలంటరీగా తొలగించిందట. ఈ సన్నివేశాల నిడివి 10 నిమిషాలకుపైనే ఉంది. వీటిలో ఎన్ని డిలీటెడ్ సీన్స్ రూపంలో వస్తాయో చూడాలి. ఇటీవల సినిమాను మరోసారి ఎడిట్ టేబుల్ మీద పెట్టారని వార్తలొచ్చిన విషయం గమనార్హం.
1
2
3
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!