Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Reviews » LYF- Love Your Father Review in Telugu: ఎల్.వై.ఎఫ్: లవ్ యువర్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

LYF- Love Your Father Review in Telugu: ఎల్.వై.ఎఫ్: లవ్ యువర్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 4, 2025 / 11:44 AM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
LYF- Love Your Father Review in Telugu: ఎల్.వై.ఎఫ్: లవ్ యువర్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శ్రీహర్ష (Hero)
  • కషికా కపూర్ (Heroine)
  • ఎస్పీ చరణ్, నవాబ్ షా, ప్రవీణ్ తదితరులు.. (Cast)
  • పవన్ కేతరాజు (Director)
  • కిషోర్ రాఠీ - మహేష్ రాఠీ - ఏ.చేతన్ సాయిరెడ్డి - అన్నపరెడ్డి సామ్రాజ్యం (Producer)
  • మణిశర్మ (Music)
  • శ్యామ్ కె.నాయుడు (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 04, 2025
  • అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్ & ప్రై లి (Banner)

దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్  (Sripathi Panditharadhyula Charan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ఎల్వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్” (LYF- Love Your Father). పవన్ కేతరాజు (Pavan Ketharaju) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా శ్రీహర్ష (Sri Harsha) హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ప్రమోషన్స్ లెవల్లో అలరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

LYF- Love Your Father Review

LYF- Love Your Father Movie Review and Rating

కథ: ప్రతి మనిషి జీవితంలో పుట్టుక తర్వాత అంత్యంత కీలకమైనది చావు. ఆ చావుకి గౌరవం ఇవ్వాలి అనేది బాధ్యతగా భావించే వ్యక్తి కిషోర్ (ఎస్పీ చరణ్). అందుకే అనాథలా ఎవ్వరూ మరణించకూడదు అనే ధ్యేయంతో, ఎవరు లేని వారికి అన్నీ తానై దహనసంస్కారాలు నిర్వహిస్తుంటాడు. అతని కొడుకు సిద్ధు (శ్రీహర్ష) కూడా తండ్రి బాటలోనే నడవడానికి సన్నద్ధమవుతాడు.

కట్ చేస్తే.. గ్యాంబ్లింగ్ మాఫియా నడిపే కబీర్ (నవాబ్ షా (Nawab Shah) Sripathiఊహించని రీతిలో తండ్రీకొడుకులు కిషోర్-సిద్ధు మీద దొంగ కేసులు బనాయించి, వాళ్లని కార్నర్ చేస్తాడు. అసలు కబీర్ తో వీళ్లకి సంబంధం ఏమిటి? అతడ్ని ఎలా ఎదిరించారు? ఈ క్రమంలో వాళ్లు కోల్పోయిందేమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “లవ్ యువర్ ఫాదర్” చిత్రం.

LYF- Love Your Father Movie Review and Rating

నటీనటుల పనితీరు: నటుడిగా అందరికంటే మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న వ్యక్తి ఛత్రపతి శేఖర్. ఈ సినిమాలో అతడు పోషించిన అఘోరా పాత్రలో అతడి ముఖాన్ని గుర్తించడం కష్టమే అయినప్పటికీ.. తన వాయిస్ మాడ్యులేషన్ తో, స్క్రీన్ ప్రిజన్స్ తో సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు.

ఎస్పీ చరణ్ లో పెద్దరికం, ఆప్యాయత వంటివి స్పష్టంగా కనిపించాయి. అయితే.. హావభావాల ప్రకటన విషయంలో ఇంకాస్త పరిణితి అవసరం. చాలా సన్నివేశాల్లో ఆయన నటన అసహజంగా ఉంది. అయితే.. సదరు పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ & సెకండాఫ్ ఎమోషన్స్ మాత్రం బాగున్నాయి. శ్రీహర్ష మొదటి సినిమా అయినప్పటికీ.. పర్వాలేదనిపించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో మంచి మెచ్యూరిటీ ప్రదర్శించాడు. సెకండాఫ్ లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ లో ఎస్పీ చరణ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ బాగా పండాయి కూడా.

ప్రవీణ్ కి చాలారోజుల తర్వాత పెద్ద పాత్ర దొరికింది. కాస్తంత కామెడీ కూడా పండించాడు. కషికా కపూర్ (Kashika Kapoor) లిప్ సింక్ ఇవ్వలేక, సరైన ఎక్స్ ప్రెషన్స్ పెట్టలేక తాను ఇబ్బందిపడి, ప్రేక్షకుల్ని కూడా ఇబ్బందిపెట్టింది. నవాబ్ షా విలన్ గా అలరించడానికి ప్రయత్నించాడు కానీ.. అతని పాత్రకి రాసిన డైలాగ్స్ మైనస్ గా మారాయి.

LYF- Love Your Father Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ బాణీలు సోసోగా ఉండగా, నేపథ్య సంగీతం మాత్రం సినిమాలోని ఎమోషన్ ను ఎలివేట్ చేసింది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదని ప్రతి ఫ్రేమ్ లో చెప్పకనే చెప్పాడు శ్యామ్ కే.నాయుడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ & ప్రొడక్షన్ డిజైన్ టీమ్ తమ బెస్ట్ వర్క్ ఇచ్చారు. డి.ఐ & మిక్సింగ్ వంటి టెక్నికాలిటీస్ కూడా బాగున్నాయి.

దర్శకుడు పవన్ కేతరాజు ఎంచుకున్న కోర్ పాయింట్ బాగుంది. తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్ ను కూడా హృద్యంగా తెరకెక్కించాడు. సెకండాఫ్ లో వచ్చే ఫన్ & ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. అయితే.. కథలో విలన్ క్యారెక్టర్ ను ఇరికించిన విధానం మాత్రం సింక్ అవ్వలేదు. మెల్లగా సాగుతున్న కథనంలోకి ఆత్రంగా పాత్రలను, ట్విస్టులకు ఇరికించినట్లుగా ఉంటుంది. అలాగే.. కీలకమైన సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. ప్రవీణ్-భద్రం-షకలక శంకర్ కాంబినేషన్ కామెడీ సీన్స్ కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా దర్శకుడు పవన్ కేతరాజు తన మొదటి ప్రయత్నంలో పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.

LYF- Love Your Father Movie Review and Rating

విశ్లేషణ: కొన్ని పాయింట్స్ పేపర్ మీద ఆసక్తికరంగా ఉంటాయి, వాటి ఎగ్జిగ్యూషన్ లో ఎమోషన్ మిస్ అయితే సినిమా ఆడియన్స్ ను అలరించడానికి ఇబ్బందిపడాల్సి వస్తుంది. “లవ్ యువర్ ఫాదర్” పరిస్థితి కూడా అంతే. కథను మొదలుపెట్టిన తీరు చూసి ఇదేదో ఆసక్తికరంగా ఉంటుంది అనిపించగా, మధ్యలో వచ్చే కాలేజ్ ఎపిసోడ్స్ కథనాన్ని కాస్త గాడి తప్పించగా, ఇంటర్వెల్ మళ్లీ చిన్నపాటి ఆసక్తి కలిగించింది. సెకండాఫ్ మొదట్లో మళ్లీ బాగుంది అనిపించేలోపు అనవసరమైన కామెడీ ఎపిసోడ్స్ తో మళ్లీ గాడి తప్పింది. ఆ కామెడీ ఎపిసోడ్స్ ను ఇరికించకుండా, తండ్రీకొడుకు పాత్రల మధ్య ఎమోషన్ ను ఇంకాస్త బాగా వర్కవుట్ చేసి ఉంటే “లవ్ యువర్ ఫాదర్” కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించేది. అవి లోపించడంతో ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.

LYF- Love Your Father Movie Review and Rating

ఫోకస్ పాయింట్: పాయింట్ మంచిదే.. ఇంకాస్త బాగా తీసుండొచ్చు!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kashika Kapoor
  • #LYF - Love Your Father
  • #Nawab Shah
  • #Pavan Ketharaju
  • #Sri Harsha

Reviews

The Fantastic Four: First Steps Review In Telugu: ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Fantastic Four: First Steps Review In Telugu: ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Hari Hara Veera Mallu Review in Telugu: హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Hari Hara Veera Mallu Review in Telugu: హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Fantastic Four: First Steps Review In Telugu: ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Fantastic Four: First Steps Review In Telugu: ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: ‘హరిహర వీరమల్లు’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే..!

HariHara Veeramallu Collections: ‘హరిహర వీరమల్లు’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే..!

Ott: ఆ ఓటీటీలు, వెబ్‌సైట్లకు షాక్‌.. బ్యాన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

Ott: ఆ ఓటీటీలు, వెబ్‌సైట్లకు షాక్‌.. బ్యాన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

Ullasanga Utsahanga Collections: ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ కి 17 ఏళ్ళు..ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Ullasanga Utsahanga Collections: ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ కి 17 ఏళ్ళు..ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Alludu Seenu Collections: డెబ్యూ హీరోల్లో అరుదైన రికార్డ్.. 11 ఏళ్ళ ‘అల్లుడు శీను’ కలెక్షన్స్ ఇవే

Alludu Seenu Collections: డెబ్యూ హీరోల్లో అరుదైన రికార్డ్.. 11 ఏళ్ళ ‘అల్లుడు శీను’ కలెక్షన్స్ ఇవే

trending news

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

15 hours ago
Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సెటైర్లు.. అసలు మేటర్ ఇది

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సెటైర్లు.. అసలు మేటర్ ఇది

18 hours ago
War 2 Trailer: అవమానాలు లెక్క చేయనంటున్న హృతిక్.. పాప పుణ్యాలు పట్టించుకోనంటున్న ఎన్టీఆర్

War 2 Trailer: అవమానాలు లెక్క చేయనంటున్న హృతిక్.. పాప పుణ్యాలు పట్టించుకోనంటున్న ఎన్టీఆర్

21 hours ago

latest news

రిటైరయ్యాక.. క్యాబ్‌ నడుపుకుంటా.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

రిటైరయ్యాక.. క్యాబ్‌ నడుపుకుంటా.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

16 hours ago
Paruchuri Review: అలా అయితే.. ‘కుబేర’కు మరో ₹50 కోట్లు వచ్చేవి.. పరుచూరి లాస్ట్‌ రివ్యూ

Paruchuri Review: అలా అయితే.. ‘కుబేర’కు మరో ₹50 కోట్లు వచ్చేవి.. పరుచూరి లాస్ట్‌ రివ్యూ

17 hours ago
Junior Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టింది..కానీ టార్గెట్ సగమే రీచ్ అయ్యింది!

Junior Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టింది..కానీ టార్గెట్ సగమే రీచ్ అయ్యింది!

17 hours ago
War 2: ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేసే ప్రయత్నం.. ‘వార్‌ 2’ స్పెషల్‌ ప్లాన్స్‌

War 2: ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేసే ప్రయత్నం.. ‘వార్‌ 2’ స్పెషల్‌ ప్లాన్స్‌

18 hours ago
Chiranjeevi: మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన డేట్.. ‘హరిహర వీరమల్లు’ సంగతేంటో?

Chiranjeevi: మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన డేట్.. ‘హరిహర వీరమల్లు’ సంగతేంటో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version