మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. దీంతో ఎవరెవరు పోటీలో ఉన్నారనే లెక్కలు తేలిపోయాయి. అక్టోబరు 10న జరిగే ఎన్నికల్లో పోటీలో దిగే అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు. ‘మా’ అధ్యక్ష పదవి బరిలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు బరిలోకి దిగుతున్నారు. తొలుత ఐదుగురు బరిలో ఉంటారని అనుకున్నా… ఆ తర్వాత ఇద్దరే ఫైనల్‌గా ఉన్నారు. ‘మా’ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబూమోహన్, శ్రీకాంత్ పోటీలో నిలిచారు.
‘మా’ లో రెండు వైస్ ప్రెసిడెంట్ పదవులు ఉంటాయి. వాటి కోసం పృథ్వీరాజ్, బెనర్జీ, హేమ, మాదాల రవి పోటీలో ఉన్నారు. ఇక జనరల్ సెక్రటరీ బరిలో జీవిత రాజశేఖర్, రఘుబాబు పోటీ చేస్తున్నారు. కోశాధికారిగా గెలిచేందుకు శివబాలాజీ, నాగినీడు పోటీపడతారు. అసోసియేషన్‌లో ఉన్న రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతంరాజ్, కళ్యాణి బరిలో దిగబోతున్నారు. ‘మా’లో ఉన్న 18 ఈసీ పోస్టుల కోసం 39 మంది అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు.
ఎన్నికలకు ఇంకా సుమారు వారం ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా… తమ ప్యానల్ గురించి చెప్పడమే కాకుండా… పదునైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరి ‘మా’ సభ్యులు ఎంతమంది ఓటేయడానికి వస్తారు… ఎవరికి ఓటేస్తారు అనేది చూడాలి.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!