ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) పై ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమానే ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ గా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 2023 లో వచ్చిన ‘మ్యాడ్’ (MAD) సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు.మార్చి 28 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, పాటలు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు.
‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ 2 :03 నిమిషాల నిడివి కలిగి ఉంది. టీజర్లో లడ్డుకి పెళ్లి కుదరడం.. ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ అయిన మనోజ్(Ram Nithin), అశోక్ (Narne Nithin) , డిడి (Sangeeth Shobhan)..లు వచ్చాక ఏం జరిగింది? తర్వాత గోవాకి ఎందుకు వెళ్లారు? అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేశారు. ఇక ట్రైలర్లో లడ్డు పెళ్లి ఆపేయాలని హీరోలు అనుకోవడం.. దానికి గల కారణాలు ఏంటి? లడ్డుని తీసుకుని వాళ్ళు గోవాకి ఎందుకు వెళ్లారు? అక్కడ వీళ్ళ కోసం పోలీసులు ఎందుకు గాలిస్తున్నారు?
లడ్డు తండ్రి గోవా ఎందుకు వెళ్ళాడు? అతన్ని ఎందుకు కిడ్నాప్ చేశారు.? మధ్య భాయ్ ఎవరు? వంటి ప్రశ్నలు, ఆసక్తి రేకెత్తిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ఇందులో కూడా ఫన్ ఎక్కువగా ఉంది. ఈ సమ్మర్ కి యూత్ ఫుల్లుగా నవ్వుకుని ఎంజాయ్ చేసే కామెడీ ఇందులో ఉందనిపిస్తుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :