సోనూసూద్ (Sonu Sood) భార్య సోనాలి సూద్ పెద్ద ప్రమాదం నుండి బయట పడినట్టు తెలుస్తోంది. నాగపూర్ హైవే పై ప్రయాణిస్తున్న సోనాలి సూద్ కారును ఓ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లారీ కూడా అదుపు తప్పడంతో ఆమె కార్ కి తగిలినట్టు స్పష్టమవుతుంది. అయితే కారు డ్రైవర్ బాగా కంట్రోల్ చేసి పక్కన ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది.కార్ ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయ్యింది.
సోనాలి సూద్ కి కూడా చిన్నపాటి గాయాలు అయ్యాయట. అయితే స్థానికులు వెంటనే ముంబైలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో.. ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇక సోనూ సూద్ అభిమానులు కంగారు పడొద్దని.. ఆయన పీఆర్ టీం ఈ విషయాన్ని వెల్లడించింది. మరోపక్క బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. ఫార్మాలిటీ కొద్దీ ఆ లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట పోలీసులు. ఇక సినిమాల్లో విలన్ గా చేస్తూ వచ్చిన సోనూసూద్..
కోవిడ్ టైంలో కష్టకాలంలో ఉన్న ఎంతో మంది పేదలకు సాయం చేశాడు. వలస కార్మికుల కోసం ఫ్లైట్, ట్రైన్ వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి.. వారిని గమ్య స్థానాలకు చేర్చాడు. అంతేకాదు లాక్ డౌన్ టైంలో తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న ఎంతో మంది ఆకలి తీర్చాడు సోనూ. అందుకే అతన్ని రియల్ హీరోగా భావించే వారి సంఖ్య ఎక్కువ. ఇక సోనూ భార్య సోనాలి సూద్ కూడా నిర్మాతగా మారి ‘ఫతే’ వంటి పలు సినిమాలు రూపొందించారు.