Rajendra Prasad: మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
- March 25, 2025 / 06:19 PM ISTByPhani Kumar
2 రోజుల క్రితం జరిగిన ‘రాబిన్ హుడ్'(Robinhood) ట్రైలర్ లాంచ్ వేడుకలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిన్న అతిధి పాత్ర చేసిన డేవిడ్ వార్నర్ ను ఆయన ‘దొంగ ము*డా కొడుకు… రేర్ వార్నర్’ అంటూ అమర్యాదగా మాట్లాడారు. ఇది అతన్ని అభిమానించే వారికి నచ్చలేదు. ‘గొప్ప క్రికెటర్ పైగా పరాయి దేశస్తుడు మన దేశానికి వస్తే ఇలా అమర్యాదగా మాట్లాడటం ఏంటి’ అంటూ అంతా రాజేంద్ర ప్రసాద్ ని తిట్టిపోశారు. దీంతో ఆయన దిగొచ్చి వార్నర్ కి క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
Rajendra Prasad

రాజేంద్ర ప్రసాద్ ఆ వీడియో ద్వారా మాట్లాడుతూ… “ఐ లవ్ డేవిడ్ వార్నర్. ఐ లవ్ హిజ్ క్రికెట్. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిమ్స్, అండ్ లవ్ ఔర్ యాక్టింగ్. సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏమైనా మనసు బాధపెట్టినట్టైతే, ఎవర్నైనా తెలియకుండా నొప్పించినట్టు అయితే… నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, ఐనా కూడా ఐ ఫీల్ వెరీ సారీ.

నేను మీ అందరికీ సారీ చెబుతున్నాను. అలాంటిది ఇంకెప్పుడూ జరగదు. జరగకుండా చూసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియోపై కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. ‘రాజేంద్రప్రసాద్ సారీ మనస్ఫూర్తిగా చెప్పినట్టు లేదని, అతనిలో రియలైజేషన్ కొంచెం కూడా కనిపించడం లేదని, డేవిడ్ వార్నర్ అలాగే అతని ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం వల్ల.. ఇంగ్లీష్లో కూడా అతనికి అర్థమయ్యేలా బలవంతంగా నిర్మాతలు సారీ చెప్పించి ఉండొచ్చు అని’ కొందరు అభిప్రాయపడుతున్నారు.
వార్నర్ కి క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్#RajendraPrasad #Robinhood #DavidWarner pic.twitter.com/8KrVqYQnPi
— Phani Kumar (@phanikumar2809) March 25, 2025












