సామాన్యులకి మాత్రమే కాదు సెలబ్రిటీలకు కూడా భద్రత ఉండటం లేదు. ‘వాళ్ళు కూడా పైకి చెప్పుకోలేని దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు’ అని ఈ విషయం తెలుసుకున్నాక మీకో క్లారిటీ వస్తుంది. హైదరాబాద్ కి వచ్చిన ఓ బాలీవుడ్ నటికి (Actress) ఒక చేదు అనుభవం ఎదురైంది. విషయంలోకి వెళితే.. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ఓ బాలీవుడ్ నటి ఇటీవల హైదరాబాద్..కు వచ్చింది. బంజారాహిల్స్,మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న ఓ స్టార్ హోటల్లో ఆమె కోసం రూమ్ వేశారు టీం.
ఆ నటి (Actress) వయసు 30 ఏళ్లు అని తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ ఆమె రూమ్లో పడుకుని ఉన్న టైంలో.. కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమె గదిలోకి చొరబడి దొంగతనం చేసినట్లు తెలుస్తుంది. ఆ నటి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ను బట్టి చూస్తే.. ఆమె రూమ్లోకి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఆమె రూంలోకి చొరబడ్డారట. తర్వాత వారు ‘అనైతిక కార్యకలాపాలకు’ పాల్పడ్డారట. ఆమెను బలవంతం పెట్టేందుకు కూడా ప్రయత్నించారని ఆమె తెలిపింది.
తర్వాత ఆమె డిఫెండ్ చేసుకునే క్రమంలో ఆ దుండగులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి తర్వాత ఆమె బ్యాగులో ఉన్న రూ. 50,000 డబ్బు, అలాగే బంగారం తీసుకుని పరారయ్యాట. తర్వాతి రోజు ఆమె (Actress) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలో హోటల్ పరిసర ప్రాంతాల ఉన్న సీసీటీవీ ఫుటేజీని వారు పరిశీలిస్తున్నట్లు సమాచారం.