Mahesh28: 11 యేళ్ళ తరువాత క్లాసిక్ కాంబో.. మహేష్ ఫ్యాన్స్ కు పండగే..!

మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఇది మహేష్ బాబు కి 27వ చిత్రం. పరశురామ్ బుజ్జి ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం. రెండో షెడ్యూల్ ఉగాది రోజున ప్రారంభించారు కానీ సెట్స్ లో కొంతమందికి కరోనా సోకడంతో షూటింగ్ ను ఆపేశారు. ఇది పక్కన పెడితే..

ఈరోజు మహేష్ బాబు 28వ సినిమాకి సంబందించిన అప్డేట్ కూడా రాబోతుంది అని ఇన్సైడ్ టాక్. చాలా రోజులుగా మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు రాబోతుందని తెలుస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు టాక్. హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేశారట. ఇక సంగీత దర్శకుడిగా మణిశర్మ ఎంపికైనట్లు తెలుస్తుంది.

గతంలో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలకు మణిశర్మనే సంగీతం అందించాడు. ఇప్పుడు 11 ఏళ్ళ తరువాత సెట్ అయిన ఈ కాంబోకి కూడా మణిశర్మ నే సంగీతం అందిస్తుండడం విశేషం. నిజానికి మొదట ఈ ప్రాజెక్టు కి తమన్, దేవి శ్రీ లను అనుకున్నారట. కానీ మణిశర్మ ఈ మధ్యన మళ్ళీ ఫాంలోకి వచ్చి దూసుకుపోతున్న నేపథ్యంలో ఇతన్నే ఫైనల్ చేసినట్టు వినికిడి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus