Mahesh Babu: ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని హిందీతో పాటు తెలుగులో కూడా టీం బాగా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ఈ టీం.. తెలుగు మీడియాతో ‘క్యూ అండ్ ఎ’ సెషన్ లో కూడా పాల్గొంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి అలాగే ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, దిల్ రాజు విచ్చేశారు. ఈ ఈవెంట్ మొత్తంలో హైలెట్ అయ్యింది మహేష్ బాబే అని చెప్పాలి. ఇక మహేష్ బాబు మాట్లాడుతూ.. ” ‘యానిమల్’ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ స్పెషల్ థాంక్స్. నిన్న ఎవరో చెప్పారు. ఇక్కడ కూడా ‘యానిమల్’ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి అని..! నాకు చాలా సంతోషంగా అనిపించింది.

నేను ‘యానిమల్’ ట్రైలర్ చూశాను. నాకు మెంటలెక్కి పోయింది. నేను (Mahesh Babu) ఎ విషయంపై అయినా మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను. నిజంగా ‘యానిమల్’ ట్రైలర్ చాలా ఒరిజినల్ గా అనిపించింది. సందీప్ నాకు ఫోన్ చేసి ‘యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తారా?’ అని అడిగాడు. నాకు నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళడానికే చాలా ఇబ్బంది..! అయినా సందీప్ అడిగినప్పుడు రావాలని అనిపించింది. అతను అంటే నాకు కూడా ఇష్టం.

మీ అందరికీ తెలుసో లేదో. నేను రణబీర్ కపూర్ కి పెద్ద ఫ్యాన్ ని..! ఇండియాలోనే అతను బెస్ట్ యాక్టర్ అని నా ఫీలింగ్. అనిల్ కపూర్ గారు.. మీ ఏజ్ అస్సలు తగ్గడం లేదు. మమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేస్తున్నందుకు థాంక్స్. ఈ డిసెంబర్ 1 న రిలీజ్ అవుతున్న ‘యానిమల్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus