Mahesh Babu: మహేష్ త్రివిక్రమ్ మూవీలో విలన్ అతనేనా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు నచ్చిన నటులను సినిమాల్లో రిపీట్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు హీరోయిన్లను సినిమాల్లో ఎక్కువగా రిపీట్ చేసిన త్రివిక్రమ్ మహేష్ సినిమాకు హీరోయిన్ గా పూజా హెగ్డేను విలన్ గా సముద్రఖనిని తీసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను కూడా త్రివిక్రమ్ సంప్రదిస్తున్నారని జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే పూజా హెగ్డే ఈ సినిమాలో నటించనుందని సమాచారం.

దర్శకుడిగా, నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో సముద్రఖని గుర్తింపును సొంతం చేసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమాలో క్లాస్ విలన్ గా సముద్రఖని మెప్పించారు. అల వైకుంఠపురములో సినిమాకు పని చేసిన నటులు, టెక్నీషియన్స్ లో ఎక్కువమంది మహేష్ త్రివిక్రమ్ సినిమాకు పని చేయనున్నారని సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథకే మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

త్రివిక్రమ్ ఆ కథనే మహేష్ బాబుకు చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ ఈ సినిమాను సమ్మర్ కే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఎన్టీఆర్ కొరటాల శివ మూవీకి పోటీగా మహేష్ త్రివిక్రమ్ సినిమా రిలీజవుతుందా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లోనే సలార్ సినిమా కూడా రిలీజ్ కానుంది. స్టార్ హీరోలంతా సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేస్తే ఒక స్టార్ హీరో సినిమా కలెక్షన్లపై మరో స్టార్ హీరో సినిమా ప్రభావం చూపే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus