Mahesh Babu, Allu Arjun: మహేష్, బన్నీ జగన్ దగ్గరకు వెళతారా?
- August 31, 2021 / 07:10 PM ISTByFilmy Focus
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్లు పెరగకపోవడం వల్ల స్టార్ హీరోల సినిమాలతో పాటు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలను సైతం నిర్మాతలు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 4వ తేదీన చిరంజీవి బృందానికి అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ ను కలిసి సమస్యలను చెప్పుకోవడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు బన్నీ, మహేష్ బాబు సుముఖంగా ఉన్నారని సమాచారం.
టికెట్ రేట్లు పెరగకపోయినా, అదనపు షోలకు అనుమతులు రాకపోయినా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే లేవు. చిరంజీవితో పాటు జగన్ ను కలవడానికి ఎవరెవరు వెళతారో తెలియాల్సి ఉంది. కేవలం నలుగురు మాత్రమే జగన్ ను కలవడానికి రావాలని పిన్సిపల్ సెక్రటరీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో వెళ్లడానికి అవకాశం ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లను కలిగి ఉండటంతో పాటు సినిమాలను నిర్మిస్తున్నారు. ఏపీలో టికెట్ రేట్లు పెరగకపోతే మాత్రం రాబోయే రోజుల్లో హీరోలు పారితోషికాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పవచ్చు. టికెట్ రేట్లు పెరిగి అదనపు షోలకు అనుమతులు లభిస్తే మాత్రమే రిలీజ్ డేట్లను ప్రకటించాలని పెద్ద సినిమాల నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ రేట్ల వల్ల లవ్ స్టోరీ మూవీ మరోసారి వాయిదా పడగా ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!
















