ఓ వైపు స్పైడర్.. మరో వైపు భరత్ అను నేను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు ని కోర్టు కేసు ఇబ్బంది పెడుతోంది. గత కొంతకాలంగా హైకోర్టు అనుమతితో కోర్టుకు దూరంగా ఉన్న మహేష్ బాబు కి కోర్టుమెట్లు ఎక్కక తప్పలేదు. తనకి సూపర్ హిట్ ఇచ్చిన చిత్రంగా నిలిచిన శ్రీమంతుడు.. చేదు జ్ఞాపకాలను సైతం మిగల్చడం బాధాకరం. ఈ సినిమాను తాను ఐదేళ్ల నాడు స్వాతి మాస పత్రిక కోసం రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవల ఆధారంగా తీశారని, తన నుంచి అనుమతులు తీసుకోలేదని ఆర్డీ విల్సన్ అలియాస్ శరత్ చంద్ర అనే రచయిత కోర్టులో కాపీ రైట్ చట్ట ఉల్లంఘనల సెక్షన్ల కింద రెండేళ్ల క్రితం కేసు వేశారు.
శ్రీమంతుడు చిత్ర దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదయింది. ఈ కేసు విచారణ నిమిత్తం కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ వారు కోర్టుకు హాజరయ్యారు. నిర్మాతల్లో ఒకరైన మహేష్ బిజీ షెడ్యూల్ వల్ల కోర్టుకి వెళ్ళలేదు. విచారణ చివరి దశకు చేరుకోవడంతో నాంపల్లి న్యాయస్థానం మహేష్ కోర్టుకి హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. కాబట్టి ఈరోజు నాంపల్లి కోర్టుకు మహేష్ హాజరయినట్లు సమాచారం. విచారణలో తనకు మినహాయింపు కలిగించాలని మహేష్ న్యాయ మూర్తులను కోరినట్లు తెలిసింది. వాస్తవ సంగతులు త్వరలో బయటకి రానున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.