సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక్కో సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం దక్కుతోంది. మహేష్ సినిమాలకు ప్రస్తుతం 300 కోట్ల రూపాయల రేంజ్ లో జరుగుతోంది. రాజమౌళి సినిమా నుంచి మహేష్ ప్రతి సినిమాకు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను మహేష్ బాబు తెలివిగా ఇన్వెస్ట్ చెస్తున్నారు.
ఇప్పటికే రెస్టారెంట్, మల్టీప్లెక్స్ బిజినెస్ ల ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతం చేసుకుంటున్న మహేష్ బాబు పలు నగరాలలో ఖరీదైన విల్లాలను కొనుగోలు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ముంబై గోవా బెంగళూరులలో మహేష్ కు ఖరీదైన విల్లాలు ఉండగా దుబాయ్ లో సైతం మహేష్ ఖరీదైన విల్లాను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది.
విల్లా రిజిస్ట్రేషన్ పనుల కోసం మహేష్ దుబాయ్ కు వెళ్లారని బోగట్టా. మహేష్ తన ఆదాయం మరింత పెరిగే విధంగా పెట్టుబడులు పెడుతున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ గ్లింప్స్ మే 31వ తేదీన రిలీజ్ కానుందని ఆరోజే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. 45 సెకన్ల నిడివితో ఈ గ్లింప్స్ రిలీజ్ కానుందని సమాచారం.
(Mahesh Babu ) మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ హీరోగా తెరకెక్కి సంక్రాంతి కానుకగా విడుదలైన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమా కూడా అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మేకర్స్ ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.