Mahesh Babu: దుబాయిలో ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన మహేష్!

Ad not loaded.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే ఈయనకు షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి ఇతర దేశాలకు ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఫ్యామిలీతో కలిసి తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే మహేష్ బాబు ఎక్కువగా దుబాయ్ కూడా వెళ్తూ ఉంటారు. ఈయన ఏడాదికి దాదాపు రెండుసార్లు దుబాయ్ పర్యటనకు వెళుతూ ఉంటారనే విషయం మనకు తెలిసిందే.

ఇలా మహేష్ బాబు దుబాయ్ పర్యటనకు వెళ్లడానికి గల కారణం అక్కడ వాతావరణం ఎంతో మంచిగా ఉండటమే కాకుండా నమ్రత సోదరి శిల్ప సైతం దుబాయ్ లో స్థిర పడటంతో నమ్రత ఎక్కువగా దుబాయ్ వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారట. అంతేకాకుండా ఇండియాకు దుబాయ్ దగ్గర కావడంతో మహేష్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లడానికి ఇష్టపడతారని తెలుస్తోంది. ఇలా ప్రతిసారి దుబాయ్ వెళ్లే మహేష్ బాబు ఏకంగా దుబాయిలో సముద్రపు వ్యూ కనిపించేలా చాలా ఆహ్లాదకరంగా ఉండే విల్లాను కొనుగోలు చేశారని తెలుస్తుంది.

ఇలా మహేష్ బాబు దుబాయిలో విల్లా కొనుగోలు చేయడంతో ఈ విల్లా రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం తాజాగా మరోసారి దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ.. ఇదే న్యూస్ రచ్చ రచ్చ చేస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీ లీల నటించబోతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus