మహేష్ కి 21 ఏళ్లే.. అవును నిజం. ఏంటండీ ఎంత యంగ్ గా ఉన్నప్పటికీ.. అందంతో కుర్రహీరోలకి పొటీ ఇస్తున్నప్పటికీ అలా చెప్పడం ఏ మాత్రం బాగాలేదండీ.. అని పెదాలు విరవకండి.. అభిమానంతో చెప్పిన మాట కాదు ఇది.. లెక్కలు వేసుకొని చెప్పిన మాట. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నప్పుడే వెండితెరపై అలరించిన మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కృష్ణ ఫ్యాన్స్ ఆమొత్తం అతన్ని రాజకుమారుడిగానే స్వాగతం పలికారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 1999 జులై 30 న రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. అంటే ఈ రోజుకి 21 ఏళ్ళు అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన స్టార్ హోదాని పెంచుకుంటూ వచ్చారు.
తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. (2019) ఈ తేదీకి సరిగ్గా రెండు దశాబ్దాల కెరీర్ ను పూర్తిచేసుకోనున్నారు. ఇంత ఎక్కువ సమయాల్లో చేసిన సినిమాలు తక్కువయినప్పటికీ ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు వంటి ఇండస్ట్రీ హిట్స్ సాధించారు.