Sitara: మహేష్ బాబు పాటకు కూతురు సితార డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటారు.. ఏదైనా ప్రత్యేకమైన సందర్భం లేదా స్పందిచాల్సిన అవసరం ఉంటేనే కానీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో పోస్టులు చేస్తుంటారు. కానీ మహేష్ సతీమణి నమ్రత మాత్రం సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తమ పర్సనల్ అండ్ ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాలన్నిటినీ ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. సోమవారం ఆమె ‘మూమెంట్స్ ఇన్ టైం’ అంటూ సితార, గౌతమ్‌ల క్యూట్ పిక్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

ఇప్పుడు మహేష్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో తమ గారాల పట్టి సితార పాప డ్యాన్స్ చేస్తున్న బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేశారు. మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసిన చిత్రం ‘అతడు’.. టీఆర్పీల్లోనూ చానాళ్లపాటు రికార్డ్ ఈ సినిమా పేరిటే ఉండేది. ఇప్పుడు సితార పాప ఈ మూవీలోని ఫీల్ గుడ్ మెలోడీ ‘పిల్లగాలి అల్లరి’ పాటకు చక్కటి హావభావాలతో ముద్దులొలికేలా స్టెప్స్ వేసింది.

ఆ వీడియో షేర్ చేస్తూ బ్యూటిఫుల్ కామెంట్‌తో తన ఆనందాన్ని పంచుకున్నారు మహేష్.. ‘చాలా చక్కగా డ్యాన్స్ చేసింది.. సితార పాప భలే ఎదిగిపోయింది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus