Mahesh Babu: మహేష్ అనుకున్న విధంగా ఆ మూవీ డిజాస్టర్ అయిందా?

సాధారణంగా హీరోలకు, దర్శకులకు సినిమా విడుదలకు ముందే కొన్ని సినిమాల ఫలితాలు తెలిసిపోతాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కథల విషయంలో, సినిమాల ఫలితం విషయంలో కరెక్ట్ గా అంచనా వేయగలరు. మహేష్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైనా ఆ సినిమాలు మహేష్ బాబు అభిమానులకు మాత్రం ఎంతగానో నచ్చాయనే సంగతి తెలిసిందే. అయితే వంశీ సినిమా ఫలితం మాత్రం మహేష్ బాబును తీవ్రస్థాయిలో నిరాశపరిచిందట.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటుందని మహేష్ ముందే ఊహించారని సమాచారం. సరైన స్క్రిప్ట్ లేకుండా తెరకెక్కించడం వల్లే ఈ సినిమా ఈ స్థాయి హిట్ గా నిలవలేదట. స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ఈ సినిమాను తెరకెక్కించగా కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నమ్రత నటించగా ఈ సినిమా షూట్ సమయంలోనే మహేష్ నమ్రత ప్రేమలో పడ్డారు.

ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రీమియర్ వేయగా ఫస్టాఫ్ చూసిన మహేష్ బాబు ఇంటికి వచ్చి డోర్ వేసుకుని పడుకున్నాడట. ప్రీమియర్ చూసిన కొంతమంది సినిమా బాగుందని చెప్పినా మహేష్ బాబు మాత్రం వాళ్ల మాటలు నమ్మలేదు. చివరకు మహేష్ ఊహించిన విధంగా మూవీ డిజాస్టర్ గా నిలిచి నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. వంశీ సినిమాను తన సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మహేష్ బాబు భావిస్తారని సమాచారం.

గతంలో ఒక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు ఈ సినిమా ఫలితం గురించి స్పందించగా మహేష్ బాబు అప్పుడు చెప్పిన విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీ షూట్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూట్ ను శరవేగంగా పూర్తి చేసి జక్కన్న సినిమాతో బిజీ కావాలని ఆయన భావిస్తున్నారు. మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus