Mahesh: ఉపాసన కజిన్ శ్రియా భూపాల్ బేబీ షవర్ ఫంక్షన్లో సందడి చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఓ పార్టీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో మహేష్ బాబు మునుపెన్నడూ చూడనంత యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. అతని లుక్ కూడా చాలా బాగుంది. దీంతో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ‘మహేష్ ను ఇంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు’ అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అసలు ఇది ఏ ఫంక్షన్? మహేష్ ఫ్యామిలీ ఎందుకు హాజరైంది? అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

మహేష్ (Mahesh) ఫ్యామిలీకి టాలీవుడ్లో సన్నిహితులు ఎక్కువే. అందులోనూ హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ మరియు పారిశ్రామికవేత్త జివికె రెడ్డి మనవరాలు అయిన శ్రియా భూపాల్‌ ఫ్యామిలీతో మరీను. ఈమె ఉపాసనకి కజిన్ అవుతుంది. గతంలో ఈమెకు అక్కినేని అఖిల్ తో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. అయితే ఏమైందో ఈమె తర్వాత అది క్యాన్సిల్ అయ్యింది. దీంతో బంధువుల అబ్బాయి అయిన అనుదీప్ తో ఈమె పెళ్లి జరిగింది.

ఈ దంపతులకి ఆల్రెడీ ఓ బాబు కూడా ఉన్నాడు. కాగా ఇప్పుడు మరోసారి శ్రియ భూపాల్ తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి ఓ బేబీ షవర్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు మహేష్ ఫ్యామిలీ స్పెషల్ గా హాజరయ్యి సందడి చేసినట్టు స్పష్టమవుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus