సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం తన సినీ కెరీర్ లో కీలకమైన దశలో ఉన్నారు. ఆయన చివరిగా నటించిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా, తదుపరి సినిమాపై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. ఎస్ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SSMB29’ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది, మొత్తం రెండేళ్ళ పాటు ఈ ప్రాజెక్ట్‌లో మహేష్ బిజీగా ఉండనున్నారని సమాచారం.
Mahesh Babu
అయితే, ఈ సినిమాకు మహేష్ పూర్తిగా కట్టుబడి ఉండటంతో, గతేడాది లాగే తన ఫ్యామిలీతో విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చు. మహేష్ భార్య నమ్రత (Namrata Shirodkar) ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వారి కుటుంబం గత ఏడాదిలో సందర్శించిన ప్రదేశాలను హైలైట్ చేశాయి. మొత్తం 9 అంతర్జాతీయ దేశాలతో పాటు, దేశీయంగా కూడా పలు ప్రదేశాలకు మహేష్ కుటుంబం వెళ్ళినట్లు తెలుస్తోంది. వారు సందర్శించిన ప్రదేశాల్లో లండన్, పోర్టోఫినో, మాల్దీవ్స్, న్యూయార్క్, దుబాయ్, బ్యాంకాక్, జెనీవా, సెయింట్ మోరిట్జ్, బాడెన్ బాడెన్, అలాగే ఇండియాలో జైపూర్, ముంబై వంటి ప్రదేశాలు ఉన్నాయి.
ఈ లిస్టును బట్టి మహేష్ బాబు ఫ్యామిలీ విహారాయత్రలో న్యూ రికార్డులలను క్తియేట్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్ కారణంగా ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మహేష్‌కు ఈ సారి ఫ్యామిలీ ట్రిప్స్ కోసం సమయం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘SSMB29’ కోసం మహేష్ ప్రత్యేకమైన మేకోవర్ పొందుతుండటంతో, తన లుక్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అంటున్నారు.
ఈ సినిమా కోసం మహేష్ పూర్తిగా డేట్స్ కేటాయించడంతో పాటు, విదేశీ షూటింగ్‌లకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు తన సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టి, కొత్త అంచులను అందుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సమయంలో, ఫ్యామిలీ ట్రిప్స్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టడం కరెక్ట్ అని భావిస్తున్నారు. మరి సినిమా షూటింగ్‌తో పాటు ప్రైవసీని కాపాడుకోవడంలో మహేష్ బాబు ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలి.