సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నెక్స్ట్ సినిమా రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘శ్రీ దుర్గ ఆర్ట్స్’ బ్యానర్ పై ఎస్.గోపాల్ రెడ్డి, కె.ఎల్.నారాయణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న మొదటి సౌత్ సినిమాగా ఈ ప్రాజెక్టు నిలవబోతోంది. 2025 జనవరి చివర్లో ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటిస్తారని టాక్ నడుస్తున్న తరుణంలో… ఈ సినిమా క్యాస్టింగ్ గురించి కూడా రకరకాల వార్తలు ప్రచారమవుతుండటం విశేషంగా చెప్పుకోవాలి.
Mahesh Babu
ఇప్పటికే ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)విలన్ గా ఎంపికైనట్టు టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క హీరోయిన్ విషయంలో కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల నుండి ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. దీనిపై రాజమౌళి టీం కానీ, మహేష్ బాబు టీం కానీ స్పందించి క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఈ విషయం ఇంకా కన్ఫర్మ్ కాకుండానే.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా ఎందుకు అంటున్నారు? బాలీవుడ్ అంతా ఈమె ఫేడౌట్ హీరోయిన్ అన్నట్టు ప్రచారం చేస్తుంది. గ్లోబల్ రేంజ్ ఫాలోయింగ్ వచ్చినా.. అలియా భట్ వంటి టాప్ వాళ్ళు అందుబాటులో ఉండగా ప్రియాంక ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే రాజమౌళి ఆలోచనలు ఊహకి అందేలా ఉండవు. మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాని ఇంటర్నేషనల్ మర్కెట్స్ లో ప్రచారం చేయడానికి తగ్గ క్యాస్టింగ్ తన సినిమాలో ఉండాలి అనేది అతని ఆలోచన కావచ్చు.
కాబట్టి.. తన క్యాస్టింగ్ లిస్టులో ప్రియాంక చోప్రా బెస్ట్ ఆప్షన్ అని అతను ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. చెప్పలేం కదా..! ఏదేమైనా ప్రియాంక చోప్రా రూమర్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే సంతృప్తిగా లేరు అని అర్థం చేసుకోవచ్చు. ఇక 2025 ఏప్రిల్ నాటికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.