రాజమౌళి (S. S. Rajamouli) – మహేష్‌బాబు (Mahesh Babu) .. లేదంటే మహేష్‌బాబు – రాజమౌళి.. ఎలా చెప్పినా (రెండు సార్లు ఎందుకు అనేది ఆఖరులో చెబుతాం) ఈ కాంబినేషన్ గురించి దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తున్నారు అనే వార్త రాగానే ఓ ప్రత్యేకమైన ఆసక్తి కనిపించింది సినిమా జనాల్లో. రాజమౌళికి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్, మహేష్ బాబుకు ఉన్న ఛరిష్మానే దానికి కారణం. అయితే ఈ కాంబినేషన్ మీద ఎక్కడో చిన్న డౌట్స్ అయితే ఇన్నాళ్లూ ఉన్నాయి.
Mahesh Babu:
తాజాగా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) డాక్యుమెంటరీ వచ్చాక మరోసారి ఆ డౌట్స్ పెద్దవి అయ్యాయి. బయటకు వచ్చాయి. అందులో నిజానిజాలు ఎంత అనేది తెలియదు కానీ.. మహేష్‌బాబు ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయిపోతున్నారు. మహేష్ కష్టపడే తత్వాన్ని, గతంలో చేసిన సినిమాల్ని, డెడికేషన్ చూసి మాట్లాడండి. మీకు మీరే ఏదో అనేసుకోవద్దు అని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. అంతగా వాళ్లు రియాక్ట్ అవ్వడానికి కారణం.. ‘ఇలాంటి కష్టం మహేష్ పడగలడా’ అనే కామెంట్సే.
రాజమౌళి సినిమా అంటే.. హీరోలు ఒక్కోసారి గాలిలో గంటల తరబడి తాళ్ల సాయంతో వేలాడుతూ ఉంటారు. ఈ విషయాన్ని తారక్(Jr NTR), రామ్‌చరణ్ (Ram Charan) ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైమ్‌లో చెప్పారు. మరి ఇప్పుడు మహేష్‌బాబు ఈ పని అంతసేపు చేస్తాడా? రాజమౌళి గత సినిమాల్లో చూస్తే దుమ్ము, ధూళి, ఎండ, వాన అని లేకుండా హీరో ఫైట్ చేస్తూనే ఉంటాడు, నటిస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఆ పని మహేష్‌తో చేయిస్తారా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీటన్నింటికి మహేష్ ఫ్యాన్స్ చెబుతున్న సమాధానం ‘వన్ నేనొక్కడినే’ (1: Nenokkadine), ‘టక్కరి దొంగ’ (Takkari Donga) సినిమాలు.
ఆ సినిమాల కోసం మహేష్ చాలా కష్టపడ్డాడు. ఎండలో, ఎడారిలో, భారీ యాక్షన్ సీన్స్ చేశాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాకు ఇలాంటివి చేయడం పెద్ద కష్టం కాదు అనేది వారి మాట. అయితే అదంతా గతం.. ఇప్పుడు ఆయన మేడ మీద సీన్ చేయడానికి కూడా మేడ, సూర్యుడు సెట్ వేయిస్తున్నాడు అనేది నెటిజన్ల మాట. ఇక పైన చెప్పినట్లు సినిమా కాంబినేషన్ గురించి రెండు సార్లు ఎందుకు చెప్పామంటే.. మహేష్ ఫ్యాన్సేమో SSMB29 అని అంటున్నారు. ఇటు రాజమౌళి ఫ్యాన్సేమో SSRMB అని అంటున్నారు. అదన్నమాట లెక్క.