కృష్ణ సొంత గ్రామంలో ఇందిరా దేవి స్మారక కార్యక్రమాన్ని నిర్వహించనున్న మహేష్ బాబు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే నెలలో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీ లెజెండరీ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణ రాజు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ షాక్ నుంచి చిత్ర పరిశ్రమ కోలుకోక ముందే సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరాదేవి సెప్టెంబర్ 28వ తేదీ అనారోగ్య సమస్యలతో మృతి చెందడం అందరిని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇలా ఇండస్ట్రీలో ఒకేసారి రెండు విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో చిత్ర పరిశ్రమ ఈ ఇద్దరికీ పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు.ఇక కృష్ణంరాజుకు వారసులు లేకపోవడంతో ప్రభాస్ అన్ని తానే తన పెదనాన్న కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇకపోతే కృష్ణంరాజు స్మారక కార్యక్రమాన్ని తన సొంత గ్రామమైన మొగల్తూరులో ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభిమానులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే ఇదే సెంటిమెంటును మహేష్ బాబు కూడా ప్రభాస్ ఫాలో కాబోతున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో రెండు రోజుల క్రితం ఫిలిం కల్చర్ క్లబ్ లో ఇందిరా దేవి సంస్కరణ సభను నిర్వహించారు. ఇకపోతే ఈమె స్మారక సభ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీనిర్వహించాలని కృష్ణ కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఈ కార్యక్రమాన్ని కృష్ణ సొంత గ్రామమైన బుర్రిపాలెంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.

ఫిలిం సర్కిల్ నుంచి వస్తున్న కథనాల ప్రకారం ప్రభాస్ మాదిరిగానే మహేష్ బాబు సైతం తన సొంత గ్రామంలో తన తల్లి కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, అభిమానులు కూడా పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల విషయంలో ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus