Mahesh Babu: మరో చిన్నారి ప్రాణాలు కాపాడిన మహేష్.. దేవుడంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనే సంగతి తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఎంతోమంది చిన్నారులకు మహేష్ బాబు తన వంతు సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీఇన్నీ కావు. ఆయన వల్ల ఎంతోమంది చిన్నారులు ప్రస్తుతం ప్రాణాలతో సంతోషంగా జీవనం సాగిస్తుండటం గమనార్హం.

గుండె సంబంధిత సమస్యలతో బాధ పడే చిన్నారులను ఆదుకునే విషయంలో మహేష్ కు ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు గొప్పదనం గురించి చెబుతూ నాగవంశీ ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దైవం మనిషి రూపంలో ఉంటాడని చెప్పడానికి మహేష్ నిలువెత్తు నిదర్శనమని ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగవంశీ ఆ ట్వీట్ లో కొన్ని వారాల క్రితం నా స్నేహితునికి తెలిసిన కుటుంబానికి సంబంధించిన నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారికి సర్జరీ చేయించాలని చెప్పారని ఆయన తెలిపారు.

నా స్నేహితుడి కోరిక మేరకు మహేష్ బాబు ఫౌండేషన్ కు ఆ విషయాన్ని తెలియజేశానని నాగవంశీ వెల్లడించారు. ఆ తర్వాత నమ్రతకు సమాచారం ఇవ్వగా ఆమె తన టీమ్ సహాయంతో చిన్నారి కుటుంబ సభ్యులను సంప్రదించడం జరిగిందని నాగవంశీ పేర్కొన్నారు. మహేష్ బాబు వల్ల ఆ చిన్నారికి సర్జరీ జరిగిందని ఆ చిన్నారి కుటుంబం మహేష్ కు కృతజ్ఞత తెలిపిందని నాగవంశీ చెప్పుకొచ్చారు.

మహేష్ ను, ఆయన కుటుంబాన్ని ప్రశంసిస్తూ నాగవంశీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి ఫోటోతో పాటు నాగవంశీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు 8200కు పైగా లైక్స్ వచ్చాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus