Mahesh Babu: యానిమల్ సినిమా ట్రైలర్ చూస్తూ ఫోన్ కూడా పడేసాను!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం యానిమల్ ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ట్రైలర్ పోస్టర్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి.

అర్జున్ రెడ్డి వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సందీప్ రెడ్డి యానిమల్ సినిమా ద్వారా తనలో మరో యాంగిల్ చూపించబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమానికి రాజమౌళి, (Mahesh Babu) మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ తన స్పీచ్ తో అదర కొట్టారు. ముఖ్యంగా ఈయన ఈ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించార. ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయిందని, ఇంత ఒరిజినల్ ట్రైలర్ ను తాను ఇదివరకు ఎప్పుడూ చూడలేదని మహేష్ బాబు తెలిపారు.

ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మెంటల్ వచ్చేసింది ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తూ నా ఫోన్ కూడా కిందకు పడేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా మహేష్ బాబు యానిమల్ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇక రణబీర్, బాబి డియోల్, అనిల్ కపూర్ గురించి కూడా ఈ సందర్భంగా మహేష్ బాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus