మహేష్ బాబు తన తోటి స్టార్ హీరోల సినిమాలకి గొంతు సాయం చేయడమనేది కొత్త విషయం ఏమీ కాదు.2008లో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ మూవీ కథ మొత్తం నడిచేది మహేష్ గొంతు తోనే..! కొన్నాళ్ల తర్వాత అంటే 2013లో మహేష్- శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ మూవీకి కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది.
ఆ రెండు సినిమాలు మంచి ఫలితాల్ని అందుకున్నాయి. అటు తర్వాత మహేష్ తన తండ్రి కృష్ణ గారు నటించిన శ్రీశ్రీ చిత్రానికి అలాగే తన అక్క మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకి నచ్చింది’ సినిమాకి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అయితే త్రివిక్రమ్, శ్రీను వైట్ల తో మహేష్ కు మంచి సాన్నిహిత్యం ఉన్న కారణంగా వాళ్ళ సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ‘ఆచార్య’ చిత్రానికి కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు అనేది తాజా సమాచారం.
చిరంజీవి- చరణ్ లతో మహేష్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిథిగా విచ్చేసి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. పైగా దర్శకుడు కొరటాల శివ అంటే మహేష్ కు చాలా అభిమానం. నిజానికి ఈ చిత్రంలో రాంచరణ్ చేసిన ‘సిద్ధ’ పాత్ర మహేష్ చేయాల్సిందే. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ చేయలేదు.
కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి కొరటాల పై అభిమానం చాటుకోబోతున్నాడు అని స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేడుకకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అనే టాక్ కూడా నడుస్తోంది. ముందుగా ఏపి ముఖ్యమంత్రి జగన్ ఈ వేడుకకి హాజరవుతారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పవన్ పేరు వినిపిస్తోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!