మహేష్ బాబుకి నోటీసులు జారీచేసిన నాంపల్లి కోర్టు
- June 12, 2017 / 01:53 PM ISTByFilmy Focus
రీల్ లైఫ్ లో కోర్టు బోనులో నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. నిజ జీవితంలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏర్పడింది. తన వైపు తప్పు లేదని చెప్పడానికి తప్పనిసరిగా బోనులో నిలవాలి. ఎందుకు ? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే.. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా చేశారు. నిర్మాణంలో భాగం పంచుకున్నారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఆ కథ తనదంటూ, 2012 లో తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలని కాపీ చేసి చిత్రీకరించారని రచయిత శరత్ చంద్ర కోర్టు లో రెండేళ్లక్రితం కేసు వేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. గతంలో నాంపల్లి కోర్టు మహేష్ బాబు, కొరటాల శివ లకు నోటీసులు జారీ చేసింది. కోర్టులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై వీరిద్దరూ హై కోర్ట్ ని ఆశ్రయించడం తో హై కోర్ట్ వీరికి మినహాయింపు కల్పించింది.
కాగా నాంపల్లి కోర్టు తాజాగా జరిపిన విచారణలో మహేష్ బాబు వ్యక్తి గతంగా కోర్టు లో హాజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది. ప్రస్తుతం మహేష్ స్పైడర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న భరత్ అను నేను చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో కోర్ట్ కి వెళ్లాల్సి రావడం మహేష్ కి తలనొప్పిగా మారింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















