Mahesh Babu: మహేష్ బాబు.. సూపర్ కూల్ పిక్ వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో ఛాన్స్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ హ్యాపీగా చిల్ అవుతూ.. తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. ఇండియాలో కంటే ఎక్కువగా మహేష్ బాబు విదేశాల్లోనే ఉంటున్నాడు.. అలాగే అక్కడే ఫ్రీ గా హ్యాపీగా ఉంటాడు అని ఆ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది.జనాల మాట కూడా అదే..! అందుకే అనుకుంట దుబాయ్ లో ఓ విల్లా కొనుక్కుని, దాని రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్ళిపోయాడు.

అలాగే సమ్మర్ కాబట్టి.. తన కూతురు స్కూల్ కి హాలిడేస్ కాబట్టి.. మరో రెండు వారాల పాటు ఆయన అక్కడే స్టే చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా మహేష్ బాబు ఓ ఫోటోని షేర్ చేశాడు. ఇందులో లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. అక్కడి రోడ్ల పై చాలా ఫ్రీగా తిరిగేస్తున్నాడు అని స్పష్టమవుతుంది. అలా ఇక్కడ తిరిగితే బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు జనాలు చేరతారు.

మహేష్ (Mahesh Babu) అనే కాదు చాలా మంది హీరోలు విదేశాలకు వెకేషన్ కు వెళ్ళేది అందుకే. ఇక తాజా లుక్ అయితే మహేష్ అభిమానులను ఫిదా చేస్తుంది. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్ నత్త నడకలా సాగుతుంది. 2024 సంక్రాంతికి రిలీజ్ అన్నారు. మరి అప్పటికి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి..! ఫస్ట్ లుక్ అయితే మే 31న కృష్ణ గారి జయంతి సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus