‘సాధారణంగా దర్శకులకి, నిర్మాతలకి ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సరే.. ఏదైనా లీక్ అయితే కడుపు రగిలి పోతూ ఉంటుంది. అలాంటి లీకుల గురించి జర్నలిస్టులు తిరిగి ప్రశ్నిస్తే.. కోపం తెచ్చుకోవాల్సింది పోయి… చాలా కంట్రోల్డ్ గా చాలా మెచ్యూర్డ్ గా, చాలా కూల్ గా, సటిల్డ్ గా సమాధానం ఇచ్చాడు శైలేష్ (Sailesh Kolanu) . అందుకు అతనిపై తెలియకుండానే ఒక గౌరవం ఏర్పడింది ఏర్పడింది’ అంటూ ఇటీవల జరిగిన ‘హిట్ 3’ (HIT 3) ప్రీ రిలీజ్ ఈవెంట్లో శైలేష్ ను అడ్డం పెట్టుకుని తన కడుపుమంటని బయటపెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి.
అందుకు గల కారణాలు అందరికీ తెలుసు. రాజమౌళి (S. S. Rajamouli) సినిమాలకి సంబంధించిన ప్రతి సినిమాకి లీకులు కామన్. కట్టుదిట్టమైన భద్రతలు తీసుకున్నప్పటికీ రాజమౌళి సినిమాలకి సంబంధించి ఆన్ లొకేషన్ నుండి సీన్ లేదా పిక్స్ లీక్ అవుతూనే ఉంటాయి. ఈ విషయంలో రాజమౌళి కూడా బాగా హర్ట్ అవుతున్నట్టు పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. అయినా ఈ లీకులు ఆగడం లేదు.
ప్రస్తుతం మహేష్ బాబుతో (Mahesh Babu) చేస్తున్న సినిమా కూడా లీకుల బారిన పడుతూనే ఉంది. ఆన్ లొకేషన్ పిక్స్ లేదా వీడియోలు వంటివి లీక్ అవ్వడం మనం చూశాం.ఇప్పటివరకు క్యాప్ తో కవర్ చేసిన మహేష్ బాబు హెయిర్ స్టైల్ కూడా ఇప్పుడు లీక్ అయ్యింది. రింగు రింగుల జుట్టుకి, హెయిర్ బాండ్ పెట్టుకుని మహేష్ ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాడు. కొద్దిసేపటికే ఇవి వైరల్ గా మారిపోయాయి.