Mahesh Babu: సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ఆ 20 సెకన్ల వీడియో… మహేష్‌ ఫ్యాన్స్‌కి పండగే!

మహేష్‌బాబును కొందరు అభిమానులు సూపర్‌ స్టార్‌ అంటారు. మరికొందరు ఇంకా ప్రిన్స్‌ అంటారు. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఫ్యాన్స్‌ ముద్దుగా ప్రిన్స్‌ పేరు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికీ యువరాజు అని అనడం కరెక్ట్‌ కాదు, ఘట్టమనేని మహరాజు అంటే బెటర్ అని కొందరు అంటుంటే.. ఎందుకు అనకూడదు రీసెంట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వీడియో చూస్తే మీరు కూడా అదే మాట అంటారు అని అంటున్నారు. అంతలా ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా?

మీరు మహేష్‌ ఫ్యాన్‌ అయితే ఆ వీడియో మరోసారి చూడండి, కాకపోతే ఫస్ట్‌ టైమ్‌ ఆ వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే కుర్ర హీరోలాగా మహేష్‌ ఆ వీడియోలో కసరత్తులు చేస్తున్నాడు. సుమారు 20 సెకన్లు ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో మహేష్‌ జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు. ‘శనివారం మెరుపులు.. ఒక నిమిషం ల్యాండ్‌మైన్‌ ప్రెస్‌, ఒక నిమిషం కెటెల్‌బెల్‌ స్వింగ్స్‌, ఒక నిమిషం స్కిల్‌మిల్‌ రన్‌’ అంటూ వరుస సెట్స్‌లో చేసినట్లు చెప్పాడు.

ఆ వీడియోను మహేష్‌ (Mahesh Babu) ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన కాసేపటికే లక్షల సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి. ఆయన సతీమణి నమ్రత అయితే ఫైర్‌ ఎమోజీలతో రిప్లై ఇచ్చారు. దీంతో ఆ వీడియో మరింత వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి అభిమానులు ‘రాజమౌళి మూవీ కోసం ఇప్పటి నుండే రెడీ అవుతున్నాడా?’ అని కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు ‘ఆ రన్నింగ్‌ స్టైల్‌లో ఎలాంటి మార్పూ లేదు. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా’ అని కామెంట్స్‌ చేశారు. మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఇండియానా జోన్స్‌ తరహాలో ఈ సినిమా ఉంటుందని ప్రాథమిక సమాచారం. అయితే ఎలాంటి కథ, ఏంటా లెక్క అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేదు. సినిమా మొదలైన వెంటనే ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టి సినిమా కథ చెప్పేయడం అలవాటు. మరి ఈ సినిమాకు కూడా అలానే చెబుతారేమో చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus