Mahesh Babu: వాళ్ల విషయంలో మహేష్ అసంతృప్తితో ఉన్నారా?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం కేజీఎఫ్ సినిమాకు పని చేసిన అంబు అరివు పని చేస్తున్నారు. అయితే ఈ ఫైట్ మాస్టర్ల పనితీరు మహేష్ కు నచ్చలేదని తెలుస్తోంది.

ఈ ఫైట్ మాస్టర్లు దేశంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఫైట్ మాస్టర్లు కావడం గమనార్హం. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పటికే హీరో పార్ట్ ఫైట్ సీన్ పూర్తైందని సమాచారం. అయితే మూడు రోజులు జరగాల్సిన షూటింగ్ ఒకటిన్నర రోజులకే ఆగిపోవడంతో ఈ సినిమా గురించి వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. మహేష్ కు నచ్చకపోవడంతో ఈ ఫైట్ మాస్టర్లు సినిమా నుంచి తప్పుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సాధారణంగా మహేష్ బాబు భారీ యాక్షన్ సీక్వెన్స్ లపై పెద్దగా ఆసక్తి చూపించరనే సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు మాత్రం ఫైట్ మాస్టర్లు ఈ సినిమా నుంచి తప్పుకోలేదని చెబుతున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమాసినిమాకు మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

గత కొన్నేళ్లుగా మహేష్ బాబు నటించిన సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాతో మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ షూట్ మొదలుకానుంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ కోసం ఇతర దేశాల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus