దాదాపు 22 సంవత్సరాల క్రితం స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. 1999 సంవత్సరంలో మహేష్ హీరోగా తెరకెక్కిన తొలి సినిమా రాజకుమారుడు విడుదలై సక్సెస్ సాధించింది. ఆ తరువాత మహేష్ నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో పాటు నటుడిగా మహేష్ స్థాయిని పెంచాయి. తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు 26 సినిమాల్లో హీరోగా నటించిన మహేష్ రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపకపోవడానికి అసలు కారణం వేరే ఉంది.
ఒకరు నటించిన కథలో తాను నటించడం తనకు నచ్చని పని అని మహేష్ బాబు భావిస్తున్నారు. రీమేక్ కథలో ఒరిజినల్ లో నటించిన హీరోనే తనకు కనిపిస్తాడని తనను తాను చూసుకోలేనని మహేష్ దర్శకనిర్మాతలకు గతంలో చెప్పినట్టు సమాచారం. ఈ కారణం వల్లే మహేష్ బాబు ఇతర భాషల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆ సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన త్రీ ఇడియట్స్ రీమేక్ సినిమాలో నటించే అవకాశం మొదట మహేష్ బాబుకే వచ్చింది.
మహేష్ ఆ మూవీ రీమేక్ మూవీ కావడంతో నో చెప్పగా మహేష్ స్థానంలో విజయ్ ఆ సినిమాలో నటించారు. బాక్సాఫీస్ వద్ద త్రీ ఇడియట్స్ రీమేక్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కొందరు దర్శకనిర్మాతలు కృష్ణ పాత సినిమాలను మహేష్ తో రీమేక్ చేయాలనే ప్రతిపాదన తెచ్చినా మహేష్ ఆ ప్రతిపాదనను కూడా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటానని మహేష్ తేల్చి చెప్పడం గమనార్హం.