Mahesh, Pawan: మహేష్ కు త్రివిక్రమ్ అలా.. పవన్ కు హరీష్ ఇలా!

మహేష్ బాబు – పవన్ కళ్యాణ్.. ఇద్దరూ కూడా టాలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోలు. ఈ ఇద్దరి హీరోలకు.. లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఏడాది మహేష్ నటించిన ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలు యావరేజ్ రిజల్ట్ లతో సరిపెట్టుకున్నాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాకి మొదటి రోజు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. అయితే ‘సర్కారు వారి పాట’ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా..

బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే విధంగా పెర్ఫార్మ్ చేసింది. కానీ బ్రేక్ ఈవెన్ కు అడుగు దూరంలోనే ఆగిపోయింది. ఈ రెండు సినిమాలు యావరేజ్ రిజల్ట్స్ తో సరిపెట్టుకోవడం వెనుక ఓ కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండు సినిమాల కథలు కూడా ఈ స్టార్ హీరోలకు మ్యాచ్ అయ్యేవి కాదు. రెండు సినిమాలను డైరెక్ట్ చేసింది మిడ్ రేంజ్ డైరెక్టర్స్. వాళ్ళు ఈ హీరోల ఇమేజ్ కు తగ్గట్టు తెరకెక్కించలేకపోయారు అని చాలా మంది చెప్పుకొచ్చారు.

అందుకే వీరు తమ తర్వాతి సినిమాలకు స్టార్ డైరెక్టర్స్ ను ఎంపిక చేసుకున్నారు. పవన్ … హరీష్ శంకర్ తో సినిమా చేస్తుండగా, మహేష్… త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడం లేదు. ఓ దశలో ఈ ప్రాజెక్టులు ఆగిపోయినట్టు కూడా ప్రచారం నడిచింది.

అయితే ఆగిపోయేంతవరకు వెళ్ళలేదు కానీ… కథలు మాత్రం మారినట్టు వినికిడి. పవన్ కళ్యాణ్ సినిమాకి అయితే కథతో పాటు టైటిల్ కూడా మార్చారు. ఇక మహేష్ బాబు సినిమాకి త్రివిక్రమ్ ఇష్టంలేకపోయినా కొన్ని మార్పులు చేసాడట. 2023 లోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus