దర్శక దిగ్గజం రాజమౌళి (S. S. Rajamouli) నెక్స్ట్ పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ స్థాయికి చేరుకోవాలని పట్టుదలగా కసరత్తు చేస్తున్నారు. రాజమౌళి సినిమాలు ఎంత కఠినంగా ఉంటాయో, ఆయనతో పనిచేసిన ప్రభాస్ (Prabhas) , రానా (Rana) , రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్‌లు (Jr NTR) చెప్పినట్టుగానే మహేష్ (Mahesh Babu)కూడా ఇప్పటికే సవాళ్లకు సిద్ధమయ్యారు. ‘బాహుబలి’ (Baahubali) , ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రాజమౌళి, ఇప్పుడు మహేష్ బాబుతో ఆ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం ఆఫ్రికా మసాయి తెగలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, జక్కన్న కెన్యా లొకేషన్లను పరిశీలించడం కూడా మొదలుపెట్టారట. భగభగ మండే ఎండలో, ఎలాంటి సెక్యూరిటీ లేని విస్తారమైన పచ్చని అడవుల్లో రాజమౌళి జీప్‌లో వెళ్ళి లొకేషన్లను పరిశీలించారు. ఈ స్థాయి అడ్వెంచర్ లొకేషన్లలో సినిమాను చిత్రీకరించడం మహేష్ బాబుకి కష్టతరమైన అనుభవమవుతుందని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా మహేష్ పూర్తిగా ఫిట్‌గా ఉండాల్సి ఉంటుంది. రాజమౌళి రీసెర్చ్ చేసి సిద్ధం చేసే ప్రతీ లొకేషన్ కూడా కొత్తగా ఉండి, నటులకు తగిన శారీరక సామర్థ్యం అవసరం కావడం ఈ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఈ స్థాయి కష్టాలు పడినట్టు మహేష్ బాబుకి ఇప్పుడు మరింత కష్టతరమైన ఛాలెంజ్ ఎదురయ్యేలా కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు ట్రైనింగ్ పై మరింత దృష్టిపెడుతున్నారట. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్ళే ఈ సినిమాతో, మహేష్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి చేర్చాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ సాహసోపేతంగా కొన్ని సన్నివేశాలు చేయాల్సి ఉండటంతో ఈ ప్రాజెక్ట్ మీద ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.