Mahesh Babu: ఆ విషయంలో ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్‌గా మహేష్ రికార్డ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సినిమాకీ తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు.. యాక్టర్, బ్రాండ్ అంబాసిడర్, సోషల్ సర్వీస్, థియేటర్, క్లాతింగ్ బిజినెస్, ప్రొడ్యూసర్.. ఇలా పలు వ్యాపకాలతో మహేష్ మామూలు బిజీగా లేడసలు.. అన్నిపనుల్లోనూ భార్య నమ్రత ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లండన్ వెకేషన్‌లో ఉన్నాడాయన. మహేష్ ఫ్యామిలీ ట్రిప్ అంటే.. వైఫ్ నమ్రత ఎప్పటికప్పుడు అక్కడి అప్‌డేట్స్ అన్నిటినీ షేర్ చేస్తుంటుంది.

ఆమె పోస్ట్ చేసే పిక్స్, వీడియోస్ అయితే అందర్నీ ఆకట్టుకుంటుంటాయి. వీళ్ల రీసెంట్ టూర్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. మహేష్, నమ్రత, పిల్లలు గౌతమ్, సితార అంతా కలిసి సరదాగా సందడి చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఖుష్ అయ్యే మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో సూపర్ స్టార్‌ని ఫాలో అయ్యేవారి నంబర్ 13 మిలియన్ మార్క్ టచ్ చేసింది. సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన యాక్టర్‌గా నిలిచాడు మహేష్.

అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సేవా కార్యక్రమాలను మాత్రం ఇంకా విస్తరిస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు మహేష్, నమ్రత. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడం, గ్రామాల దత్తత.. ఇలా పలుమార్లు తన మంచి మనసు చాటుకున్నారు. ఇప్పుడు కృష్ణ సొంతగ్రామమైన బుర్రిపాలెంలో గల స్కూల్‌లో డిటిటల్ లెర్నింగ్ క్లాసులకు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా అవసరమైన సాయమందించారు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు మహేష్. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో ఓ యాక్షన్ అడ్వెంచరస్ ఫిలిం చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆఫ్రికన్ అడవుల్లో షూటింగ్ జరుపనున్న ఈ చిత్రాన్ని 2025లో రిలీజ్ చేస్తారని సమాచారం.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus